బడ్జెట్ ఫోన్స్ కు పెరుగుతున్న డిమాండ్.. టాప్ - 5 బడ్జెట్ ఫోన్స్ ఇవే.!

ఇటీవల స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పదో తరగతి విద్యార్థుల నుంచి 50 ఏళ్లు పైబడిన వారి వరకు అంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది తక్కువ బడ్జెట్ లోనే ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్లోనే ఫోన్లు ఉండాలని భావిస్తున్న వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ కంపెనీలు కూడా వివిధ మోడల్స్ను తక్కువ ధరల్లో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. రూ.10 వేలలోపు ధరల్లో ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు సమాచారాన్ని అందిస్తున్నాం. మోటోరోలా జి 05 ఫోన్ కేవలం రూ.6,990 కు లభిస్తోంది. ఇందులో అనేక ఫీచర్లో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మీడియా టెక్ హీలియో జీ81 చిప్ సెట్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ - 2 ప్రొటెక్టెడ్ 6.65 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం

symbolic image

ఇటీవల స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పదో తరగతి విద్యార్థుల నుంచి 50 ఏళ్లు పైబడిన వారి వరకు అంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది తక్కువ బడ్జెట్ లోనే ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్లోనే ఫోన్లు ఉండాలని భావిస్తున్న వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ కంపెనీలు కూడా వివిధ మోడల్స్ను తక్కువ ధరల్లో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. రూ.10 వేలలోపు ధరల్లో ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు సమాచారాన్ని అందిస్తున్నాం. మోటోరోలా జి 05 ఫోన్ కేవలం రూ.6,990 కు లభిస్తోంది. ఇందులో అనేక ఫీచర్లో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మీడియా టెక్ హీలియో జీ81 చిప్ సెట్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ - 2 ప్రొటెక్టెడ్ 6.65 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఐపి 54 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ తోపాటు 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. అదే మోటోరోలా జీ35 5జి స్మార్ట్ ఫోన్ టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ గా దీన్ని చెప్పవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో రూ.9999 కే లభిస్తోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.72 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. అలాగే యూనిసాక్ టీ760 ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ లో 5000 Mah బ్యాటరీ ఉండడంతో పనితీరు బాగుంటుంది. 

మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. అదే రియల్ మీ సీ61. ఈ స్మార్ట్ రూ.10 వేలలోపు ధరలో దొరికే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది అధిక రిఫ్రెష్ రేటు డిస్ప్లే తో పాటు రోజంతా ఉపయోగించేందుకు అతిపెద్ద బ్యాటరీతో వచ్చే సొగసైన స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో రియల్ మీ యు ఐ ద్వారా పనిచేస్తుంది. సాధారణ గేమింగ్ తో పాటు రోజువారి పనులకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు రెడ్ మీ కంపెనీకి చెందిన A4 5జీ స్మార్ట్ ఫోన్ రూ.8,499 ధరకే అందుబాటులో లభిస్తోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ 5జి ఫోన్ గా ఇది మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. మీడియా టెక్ చిప్ సెట్ తో వచ్చే ఈ ఫోన్లో 50 ఎంపీ ప్రధాన కెమెరా తో భారీ బ్యాటరీ ఉంటుంది. అందువల్ల రోజువారి పనితీరులో మెరుగ్గా ఉంటుంది. అలాగే మార్కెట్లో మరో తక్కువ ధరకు వచ్చే శాంసంగ్ కంపెనీ ఫోన్ కూడా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ ఫోన్ లవర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సూపర్ స్మార్ట్ఫోన్ ధర ప్రస్తుత మార్కెట్లో రూ.9,199 ధరల్లో లభిస్తోంది. దీనికి అతిపెద్ద డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు సరిపోయే కెమెరాలతో ఆకట్టుకుంటుంది. అధునాతన ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. బడ్జెట్ ధరలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ను కావాలనుకునే వాళ్ళు ట్రై చేయవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్