ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అన్ని వృత్తుల్లోనూ మహిళలు అధికంగా ఉంటున్నారు. అనేక సంస్థలు మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశంలో మహిళా ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అన్ని వృత్తుల్లోనూ మహిళలు అధికంగా ఉంటున్నారు. అనేక సంస్థలు మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశంలో మహిళా ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గడిచిన ఏడాదితో పోల్చితే 2025లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% మేరా పెరిగినట్లు తాజాగా ఫౌండిట్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. ఈ సంస్థ అధ్యయన ప్రకారం అనుభవం కలిగిన వారితో పోలిస్తే కొత్తవారికి విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నట్లు వెల్లడించింది. కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, తయారీరంగం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది 25 శాతం మంది కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కెరియర్ ప్రారంభంలో ఉన్న మహిళలకు మరింత ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఈ సంస్థ అధ్యయనంలో వెళ్ళడైంది.
మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న రంగాల్లో ఎక్కువగా ఐటి, మానవ వనరులు (హెచ్ఆర్), మార్కెటింగ్ విభాగాల్లో అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అనుభవం పరంగా చూసిన.. ఆయా రంగాల్లో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి 53 శాతం, నాలుగేళ్ల నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారికి 32 శాతం అవకాశాలు వస్తున్నాయని ఈ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. పరిశ్రమలు, ఐటీ, కంప్యూటర్, అకౌంట్స్ విభాగాల్లో మహిళలకు 34% ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు ఈ సంస్థ అధ్యయనం వివరించింది. భారత జాబు మార్కెట్లో మహిళలకు మరిన్ని అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా పరిశ్రమలు, టెక్నాలజీ విభాగాల్లో వారికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) కు సంబంధించిన సైబర్ భద్రత, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక విభాగాల్లోనూ నైపుణ్యం ఉన్న మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ఏది ఏమైనా గతంతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతుండడం ద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పురుషులతో సమానంగా అనేక రంగాల్లో మహిళలు ఉద్యోగ అవకాశాలు పొందడానికి వారిలో ఉన్న నైపుణ్యాల కారణమని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో పురుషులను మించి మరి మహిళలు ఉద్యోగ అవకాశాలను సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.