ఎండలే ఎండలు.. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రస్థాయిలో కాస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఒక్కబోత వేధిస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. గడిచిన రెండు రోజుల నుంచి రెండు నుంచి మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి.  ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రస్థాయిలో కాస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఒక్కబోత వేధిస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. గడిచిన రెండు రోజుల నుంచి రెండు నుంచి మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో వాయువ్య దిశగా గాలులు వీస్తుండడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అధిక ఉష్ణోగ్రత ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో కూడా దాదాపు ఇటువంటి వాతావరణమే నెలకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా ఖమ్మం, హనుమకొండలో ఎండ మండిపోతోంది. ఖమ్మంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి 40 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా ఇదేవిధంగా ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాదులోనూ 37 డిగ్రీలు పైగా ఎండ తీవ్రత నమోదవుతోంది. రానున్న రెండు మూడు రోజుల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఎలా ఉంటే ఎండ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే 125 ఏళ్ల తర్వాత రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రా వద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండ తీవ్రత నేపథ్యంలో గర్భిణీలు, చిన్నారులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి వల్ల డిహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్