నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు ఎంతోమంది కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుంటారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహంతో జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది నిర్ణయించుకుంటారు. అయితే కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు జాబితాలో కొన్ని ముఖ్యమైన ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కీలక నిర్ణయాలను అమలు చేయడంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని పలువురు నొక్కి వక్కానిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు ఎంతోమంది కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుంటారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహంతో జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది నిర్ణయించుకుంటారు. అయితే కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు జాబితాలో కొన్ని ముఖ్యమైన ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కీలక నిర్ణయాలను అమలు చేయడంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని పలువురు నొక్కి వక్కానిస్తున్నారు. సాధారణంగా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటే దీర్ఘకాలంలో అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలంలో అమలు చేయాల్సిన నిర్ణయాలు విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్వల్పకాలిక నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేయడం అత్యంత కీలకంగా నిపుణులు చెబుతున్నారు.
దురాలవాటులకు దూరంగా ఉండడం అత్యవసరం..
కొత్త ఏడాది వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ తీసుకునే నిర్ణయాల్లో మద్యం మానేయడం, స్మోకింగ్ కు దూరంగా ఉండడం వంటి నిర్ణయాలు ఉంటాయి. ఈ తరహా అలవాట్లు ఉండేవారు తప్పనిసరిగా ఈ నిర్ణయాలను బలంగా తీసుకొని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటినీ ఒకేసారి మానేయడం అనేది కొంత ఇబ్బందితో కూడిన అంశంగా ఉంటుంది. కాబట్టి మొదట స్మోకింగ్, ఆ తరువాత ఆల్కహాల్ వంటివి మానేయడం ఉత్తమంగా పేర్కొంటున్నారు. ఒకేసారి మానేయడం కంటే తీసుకునే మొత్తాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు బెట్టింగ్, జూదం వంటి వాటికి దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం వల్ల కొత్త ఏడాదిలో జీవితం సాఫీగా సాగేందుకు దోహదం చేసినట్లు అవుతుందని సూచిస్తున్నారు.
ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలక
జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లేని వారి జీవితాలు అగమ్య గోచరంగా తయారవుతాయి. కాబట్టి కొత్త ఏడాది నుంచి ఆర్థిక క్రమశిక్షణతో కూడిన జీవితాలను అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు పూలబాట వేసుకోవచ్చు. ఆదాయాన్ని, ఖర్చులను లెక్కపెట్టుకొని ప్రతినిలా వచ్చే ఆదాయంలో కనీసం 20 నుంచి 30% ఆదా చేసేలా ప్రణాళిక వేసుకోవడం అత్యంత కీలకం. ఇప్పుడు చేసే ఆదా భవిష్యత్తులో కీలకమైన అవసరాలను తీర్చే నిధిగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
కాలం అత్యంత విలువైనది. ఒకసారి గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కాలాన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఏడాది నుంచి దీనిపై దృష్టి పెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే అంతవరకు ఉన్న సమయాన్ని షెడ్యూల్ వేసుకొని.. అందుకు అనుగుణంగా రోజువారీ కార్యకలాపాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యత తప్పనిసరి..
డబ్బు, సమయం వంటివి ఉన్న ఆరోగ్యం లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ప్రాధాన్యతన ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో ఆరోగ్యానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా కీలకము. ఉదయాన్నే నిద్ర లేవడం, శారీరక శ్రమ కలిగించే ప్రక్రియలు చేపట్టడం చాలా కీలకం. దీనివల్ల శరీరానికి వచ్చే వ్యాధులను నయం చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం మానస ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మానసిక ఆరోగ్యం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం యోగ, మెడిటేషన్ వంటి ప్రక్రియలను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మనసుకు ప్రశాంతతను కలిగించే మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, ప్రదేశాలకు వెళ్లడం వంటివి అప్పుడప్పుడు చేయాలని, ఇటువంటి కార్యకలాపాల కోసం కూడా షెడ్యూల్ కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమలు చేయాలంటే ఇలా చేయాలి..
కొత్త ఏడాదిలో తీసుకునే నిర్ణయాలను కొద్దిమంది మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. మొదటి ఒకటి, రెండు నెలలు ప్రణాళికలు విషయంలో స్పష్టంగా ఉండే ఎంతోమంది మూడు, నాలుగు నెలల తర్వాత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే, దీర్ఘకాలికంగా ఉండే ప్రణాళికలను అమలు చేయడంలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి స్వల్పకాలకు లక్ష్యాలను నిర్దిష్టంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొత్త ఏడాదిలో పెట్టుకునే లక్ష్యాలు ఉదయం లేవగానే కనిపించేలా ఒక బోర్డు పైన రాసుకోవడం వల్ల నిరంతరం గుర్తుకు వస్తుంటాయి. అలాగే, కొత్త ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలను ఎక్కువ మంది స్నేహితులుకు చెప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులకు చెప్పాం కాబట్టి వాటిని అమలు చేయడంలో కాస్త కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.