కొత్త ఏడాదిలో కుమ్మేసిన మందుబాబులు.. తెలంగాణకు భారీగా ఆదాయం

న్యూ ఇయర్‌ వేడుకలను తెలంగాణ వాసులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. మందుబాబులు నూతన సంవత్సర వేడుకల్లో మందేసి గట్టిగానే చిల్‌ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు గట్టిగానే తాగడంతో ఎక్సైజ్‌శాఖకు రికార్డుస్థాయిలో ఆదాయం లభించింది. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రను తిరగరాసేలా మందుబాబులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. పెగ్గుపెగ్గుకో కిక్‌ అన్నట్టుగా మందుబాబులు తాగి చిందేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వచ్చిన ఆదాయాన్ని చూసి ఎక్సైజ్‌శాఖ అధికారులు షాక్‌ అయ్యారంటే ఏ స్థాయిలో ఆదాయం సమకూరిందే అంచనా వేయవచ్చు.

Liquor sales

మద్యం అమ్మకాలు

న్యూ ఇయర్‌ వేడుకలను తెలంగాణ వాసులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. మందుబాబులు నూతన సంవత్సర వేడుకల్లో మందేసి గట్టిగానే చిల్‌ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు గట్టిగానే తాగడంతో ఎక్సైజ్‌శాఖకు రికార్డుస్థాయిలో ఆదాయం లభించింది. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రను తిరగరాసేలా మందుబాబులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. పెగ్గుపెగ్గుకో కిక్‌ అన్నట్టుగా మందుబాబులు తాగి చిందేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వచ్చిన ఆదాయాన్ని చూసి ఎక్సైజ్‌శాఖ అధికారులు షాక్‌ అయ్యారంటే ఏ స్థాయిలో ఆదాయం సమకూరిందే అంచనా వేయవచ్చు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీగా పెరగడం వల్ల ఆ స్థాయిలో ఆదాయం వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణలో డిసెంబర్‌ నెలలో అమ్మకాలు గట్టిగానే జరిగాయి. రూ.3,805 కోట్లు విలువైన మద్యం అమ్మినట్టు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 23 నుంచి 31 వరకు అధికంగా అమ్మలు జరిగాయి. ఈ రోజుల్లో రూ.1700 కోట్లు మేర వ్యాపారం జరిగింది. 2023తో పోలిస్తే రూ.200 కోట్లు మేర అదనంగా వ్యాపారం జరిగింది. డిసెంబరు 23న రూ.193 కోట్లు, డిసెంబర్‌ 24న రూ.194 కోట్లు, 26న రూ.192 కోట్లు, 27న రూ.187 కోట్లు, 28న రూ.191 కోట్లు, 30న రూ.402 కోట్లు, 31న రూ.282 కోట్లు రూపాయలు మేలు విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. 

నో క్రైమ్‌.. జీరో యాక్సిడెంట్స్‌..

నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరగడం, అనేక చోట్ల గొడవలు చోటుచేసుకోవడం సాధారణంగా జరుగుతుంటాయి. అయితే, ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాలను నియంత్రించడంతోపాటు గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ముందుగానే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో నగరవాసులు సాఫీగానే నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. దీంతో హైదరాబాద్‌ సిటీలో నో క్రైమ్‌, జీరో యాక్సిడెంట్స్‌ నమోదయ్యాయి. ఒక్క ప్రమాదం కూడా నమోదు కాలేదని, ఎక్కడా గొడవలు చోటుచేసుకోలేదని పోలీసులు వెల్లడించడంతో అంతా హ్యాపీగానే నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకున్నట్టు అయింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్