తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగేనా.. ఢిల్లీకి మరోసారి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ విస్తరణకు సిద్ధపడుతున్నారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి గడిచిన కొద్ది నెలలుగా నెలకొంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతున్న క్యాబినెట్ విస్తరణకు అవకాశం రాకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కొంత అసహనంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ ను విస్తరించి తనకు కావాల్సిన వాళ్ళకి మంత్రి పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

cm revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ విస్తరణకు సిద్ధపడుతున్నారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి గడిచిన కొద్ది నెలలుగా నెలకొంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతున్న క్యాబినెట్ విస్తరణకు అవకాశం రాకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కొంత అసహనంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ ను విస్తరించి తనకు కావాల్సిన వాళ్ళకి మంత్రి పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం అధిష్టానం నుంచి అనుమతి పొందేందుకు రేవంత్ రెడ్డి కొత్త పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ అధిష్టానం క్యాబినెట్ విస్తరణను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ విస్తరణకు అనుమతి పొంది రావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఆసావకులు ఉత్సాహంగా పార్లమెంటు ఎన్నికల్లో పని చేయడానికి ఖాళీగా ఉంచారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆశావాహ నేతలకు లక్ష్యాలను పెట్టి మరి పని చేయించుకున్నారు. వారంతా ఇప్పుడు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఈ క్యాబినెట్ బెర్తులను భర్తీ చేస్తే అసంతృప్త నేతలు పెరుగుతారన్న ఉద్దేశంతోనే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అయితే, ఒకటి, రెండు బెర్తులను ఖాళీగా ఉంచి మిగిలిన వాటిని భర్తీ చేయడం ద్వారా కొందరికి ఆయన మేలు చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. ఈ జాబితాలో గడ్డం వివేక్, వినోద్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ ఉన్నారు. వీరంతా మంత్రి పదవులను ఆశిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్