స్పామ్ కాల్స్ విషయంలో కీలక ఆదేశాలు.. చెక్ పెట్టాల్సిందిగా ట్రాయ్ ఆదేశాలు

స్పామ్ కాల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఈ తరహా కాల్స్ తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. వీటికి చెక్ చెప్పాలంటూ ఎప్పటి నుంచో వినియోగదారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేలా కీలక ఆదేశాలను ట్రాయ్ జారీ చేసింది. స్పామ్ కాల్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.

Spam calls

స్పామ్ కాల్స్

స్పామ్ కాల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఈ తరహా కాల్స్ తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. వీటికి చెక్ చెప్పాలంటూ ఎప్పటి నుంచో వినియోగదారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేలా కీలక ఆదేశాలను ట్రాయ్ జారీ చేసింది. స్పామ్ కాల్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రమోసనల్ మార్కెటింగ్ కు, రిజిస్టర్ చేసుకొని సంస్థలు చేసే కాల్స్, కంప్యూటర్ జనరేటర్ కాల్స్ ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో అన్ రిజిస్టర్డ్, తెలియ మార్కెట్ల నుంచి వస్తున్న కాల్స్ పై ట్రాయ్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఆయా అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ల డేటాను సమర్పించాలంటూ టెల్కో లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు యాక్సిస్ ను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేసింది. ఈ తరహా కాల్స్ ను నియంత్రించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. వినియోగదారులు తమకు వచ్చే స్పామ్ కాల్స్ పై సాధారణంగా ఆయా టెలికాం ఆపరేటర్లు సూచించే నెంబర్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కానీ, డు నాట్ డిస్టర్బ్ సేవ కోసం ఏఏ సంస్థలకు యాక్సిస్ ఇవ్వాలి. ఏఏ సంస్థలను బ్లాక్ చేయాలి అనేవి సామాన్యులు తెలుసుకోవడం కష్టమే. అన్ని సంస్థలను డీఎన్డీలో పెడితే బ్యాంకు నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లు కూడా నిలిచిపోతాయి. ట్రాయ్ అందుబాటులోకి తీసుకువచ్చిన డి అండ్ డి యాప్ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. ఇందులో స్పామ్ కాల్స్ పై ఫిర్యాదు చేయడం మొదలు, డి అండ్ డి లో ఫీచర్ల వారీగా యాక్టివేట్, డి ఆక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్, ట్రాయ్ వెబ్సైట్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల చాలా వరకు స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ట్రాయ్ ఆదేశాల మేరకు స్పామ్ కాల్స్ నియంత్రణకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్