రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్నాళ్ల నుంచి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల తెలంగాణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ కార్డులు
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్నాళ్ల నుంచి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల తెలంగాణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల నుంచి అర్హులైనప్పటికీ రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. వీరంతా ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ మేరకు వినతులు ఇస్తూ కోరుతున్నారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం వినతులు వస్తుండడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కార్డులు మంజూరుకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రేషన్ కార్డులకు ఇప్పుడు ఇచ్చే ఆరు కిలోలతోపాటు సన్న బియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ప్రశ్న వేయగా దానికి సమాధానం ఇస్తూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. 80 లక్షల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చాయని, ఇందులో 24 లక్షల మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం మరో 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన సభాముఖంగా వెల్లడించారు. ఒక్కో కార్డుకు 3.10 లక్షల మంది ఉంటారని అంచనా వేసామని, అంటే మొత్తంగా 31 లక్షణం మందికి వ్యాసం కంపెనీ చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల అదనంగా ప్రభుత్వానికి రూ.956 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఏ విధి విధానాలతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని దానిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలని దానిపై లెటర్ రాశామని పేర్కొన్నారు. వచ్చిన సూచనలకు అనుగుణంగా కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదనపు కార్డులు ఇవ్వడంతోపాటు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అర్హతలు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.