నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ప పీడన క్రమంగా పశ్చిమ దశగా కదులుతూ నైరుతి, దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతం అవుతుంది.
కురుస్తున్న వర్షం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ప పీడన క్రమంగా పశ్చిమ దశగా కదులుతూ నైరుతి, దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతం అవుతుంది. తాజాగా నెలకొన్న అల్పపీడనం ప్రభావంతో బుధవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, వైయస్సార్, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలోని కొను ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటితోపాటు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోని కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురవలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు బుధవారం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాదులో వాతావరణం లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో గరిష్టంగా క్రమంలో 34 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాదులో 33.4 డిగ్రీలు మిగిలిన అన్ని జిల్లాల్లో 30 నుంచి 31.5 డిగ్రీలు మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. మెదక్ లో 14.2° డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ లో 15.2° డిగ్రీలు, పటాన్చెరులో 17.2 డిగ్రీలు, నిజామాబాదులో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటులు చేసుకోవాలని వెల్లడించారు.