ఆరోగ్యంతోపాటు అందంపైన ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ముకారవిందం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ముఖంపై మొటిమలు, మచ్చలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన చెందే యువత.. వీటిని తగ్గించుకునేందుకు వెళ్లని నిపుణులు, చూడని ఆసుపత్రులు ఉండడం లేదు. యువతలో ఉన్న ఈ చిన్నపాటి అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది వేలకు వేలు వారి నుంచి వసూలు చేస్తున్నారే తప్ప సమస్య నుంచి వారిని దూరం చేయలేకపోతున్నారు.
బీట్ రూట్ జ్యూస్
ఆరోగ్యంతోపాటు అందంపైన ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ముకారవిందం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ముఖంపై మొటిమలు, మచ్చలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన చెందే యువత.. వీటిని తగ్గించుకునేందుకు వెళ్లని నిపుణులు, చూడని ఆసుపత్రులు ఉండడం లేదు. యువతలో ఉన్న ఈ చిన్నపాటి అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది వేలకు వేలు వారి నుంచి వసూలు చేస్తున్నారే తప్ప సమస్య నుంచి వారిని దూరం చేయలేకపోతున్నారు. అయితే, తక్కువ మొత్తం ఖర్చు వెచ్చించి ఒక జ్యూస్ తాగడం ద్వారా మొఖం నిగారింపును సొంతం చేసుకునేలా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖ కాంతిని కాపాడుకోవడానికి చాలామంది ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేకపోగా మరింత నష్టం వాటిల్లుతూ ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటువంటి వారు ఆహారం, పానీయాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిగనిగలాడే ముఖ అందం కోసం బీట్ రూట్ జ్యూస్ వినియోగించాలని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఈ జ్యూస్ ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.
రోజువారి డైట్ లో ఈ జ్యూస్ ను చేర్చుకుంటే ముఖ అందం మెరుగు కావడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తుందని సూచిస్తున్నారు. బీట్రూట్ లో ఉండే లైకోపీన్, స్కాలేన్ చర్మ అందానికి మేలు చేస్తాయి. ముఖంపై యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయాలనుకుంటే రోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. బీట్రూట్ చర్మం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. చర్మం శరీరం రెండింటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది బీట్రూట్ రసం చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. తద్వారా ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ చిన్నపాటి చిట్కాను పాటించడం ద్వారా ముఖం నిగారింపును సొంతం చేసుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బీట్రూట్ జ్యూస్ ను ఇంట్లోనే ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకునేందుకు అవకాశం ఉంది. ముఖ అందం కోసం వేలకు వేలు ఖర్చు చేయడం కంటే అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఈ జ్యూస్ ద్వారా ముఖ వర్చస్సు వెలిగిపోయేలా చేయవచ్చని నిపుణులు చూపిస్తున్నారు దీన్ని ఫాలో కావడం ద్వారా ఈ సమస్యకు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. మరి మీరు ఫాలో అవ్వండి.