కడుపు క్లీన్ గా ఉండాలంటే ప్రతి రోజు ఇవి తినాల్సిందే.. డాక్టర్ అవసరమే పడదు.!

కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉరుకులు పరుగులు జీవితంలో ఎంతోమంది సమయానికి తినడం అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే ఏదో ఒకటి తిని మమా అనిపిస్తుంటారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు వంటివి లోపం ఏర్పడుతుంది దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇటువంటి వాటికి చెక్ చెప్పాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

Soaked Pesa

నానబెట్టిన పెసలు

ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఎంతగానో దోహదం చేస్తుంటాయి. ఈ విషయాలను వైద్యులు చెబుతున్నప్పటికీ ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను చేసుకోవడం ద్వారా అనారోగ్యానికి దూరంగా ఉండి వైద్యులు వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉరుకులు పరుగులు జీవితంలో ఎంతోమంది సమయానికి తినడం అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే ఏదో ఒకటి తిని మమా అనిపిస్తుంటారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు వంటివి లోపం ఏర్పడుతుంది దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇటువంటి వాటికి చెక్ చెప్పాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే, సమయానికి ఆహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు విషయానికొస్తే తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ తీసుకోవాలి. చాలా మంది టిఫిన్ చేయడాన్ని కొన్నిసార్లు స్కిప్ చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారం చేయడం శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు ఉపకరిస్తుంది. ఎక్కువ మంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి తిన్న ఆహారం జీర్ణం కాదు. మరి కొంతమంది మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు.

ఇంకొందరికి ఆహారం తింటే కడుపునొప్పి మొదలవుతుంది. ఇటువంటి సమస్యలకు చెప్పి కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదని వారు సూచిస్తున్నారు. అల్పాహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, అల్పాహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సరిగా ఉండేలా చూసుకోవాలి. మొలకెత్తిన గింజలను బ్రేక్ ఫాస్ట్ లోకి తీసుకుంటే చాలా మంచిది. నానబెట్టిన పెసళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నానబెట్టిన పెసళ్ళలో విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. పెసళ్ళు త్వరగా శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలసట నుండి ఉపశమనం పొందడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. నానబెట్టిన పెసళ్ళలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్ వంటి సమస్యలను అరికడుతుంది. పెసళ్ళలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. చేపలు, మాంసం, గుడ్లు తినని వారి కండరాలను బలంగా ఉంచడంలో, కొత్త కణాలను ఏర్పరచడంలో, ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో పెసలు కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి రోజువారి ఆహారంలో పెసళ్ళను పెట్టుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్ మానకుండా ఉండడంతోపాటు బ్రేక్ ఫాస్ట్ లో ఈ నానబెట్టిన పెసలను యాడ్ చేసుకోవడం ద్వారా మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంది.  పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఈ సలహాలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్