యువకులు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. గంటలు తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ పెట్టుకుని మ్యూజిక్ వినడం, కాల్స్ మాట్లాడడం, గేమ్స్ ఆడడం వల్ల చెవికి సంబంధించిన అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని ఈఎన్టీ వైద్యుని పనులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ గంటలు తరబడి ఉపయోగించడం వల్ల వినికిడిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా చెవుల వినికిడి శక్తికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి.
చెవిలో ఇయర్ బర్డ్స్
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. యువకులు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. గంటలు తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ పెట్టుకుని మ్యూజిక్ వినడం, కాల్స్ మాట్లాడడం, గేమ్స్ ఆడడం వల్ల చెవికి సంబంధించిన అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని ఈఎన్టీ వైద్యుని పనులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ గంటలు తరబడి ఉపయోగించడం వల్ల వినికిడిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా చెవుల వినికిడి శక్తికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ వాడుతున్న యువత ఎక్కువ శాతం మంది ఈ ప్రమాణాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఎక్కువ సౌండ్ తో పాటలు వింటున్నారు. ఇది చెవుల నరాలకు ప్రమాదకరంగా మారుతోంది. సాధారణంగా 75 డెసిబుల్స్ తో ఎనిమిది గంటలపాటు నిరంతరం సంగీతాన్ని వింటే అది హానికరమని వెల్లడిస్తున్నారు. 80 నుంచి 100 లేదా 120 డెసిబుల్స్ వద్ద సంగీతాన్ని వినడం వలన వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మంది ఉదయం రన్నింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ పెట్టుకుని కనిపిస్తుంటారు. ఇటువంటి వారంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది విద్యార్థులు కూడా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే స్టడీకి సంబంధించిన మెటీరియల్ ను వింటుంటారు. గంటలు తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆన్లైన్లో క్లాసులు వినడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. గంటలు తరబడి ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం చెవులకు మంచిది కాదు. వినికిడిలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. లేకపోతే భవిష్యత్తులో వినికిడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే వినికిడి సంబంధిత సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్లు వంటి వాటితో బాధపడుతూ ఈఎన్టీ వైద్యుల వద్దకు వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. ఈ ఎన్ టి వైద్యులు వద్దకు రోజువారి వచ్చే రోగుల్లో 70 శాతం మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వినికిడి సమస్య, చెవి ఇన్ఫెక్షన్ గురించి చెబుతున్న వారిలో ఎక్కువమంది గంటలు తరబడి ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ వాడుతున్నట్లు చెబుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటువంటి వారిలో వినికిడి సమస్యతోపాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని, వీటి నుంచి బయటపడేందుకు ఇయర్ ఫోన్స్ ను అత్యంత పరిశుభ్రమైన ప్రాంతాల్లో స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టి వాటిని మళ్ళీ చెవిలో పెట్టుకోవడం వల్ల చెవికి ఇబ్బందులు కలిగించే ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి యువత ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ప్రతిరోజు నాలుగు గంటలకు మించి ఇయర్ ఫోన్స్ / ఇయర్ బర్డ్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ సమయంపాటు వాడాల్సివస్తే ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.