పది, ఇంటర్ పాస్ అయితే చాలు భారీ వేతనాలతో ఉద్యోగాలు.. తొందరపడండి మరి.!

నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. పదో తరగతి నుంచి వివిధ అర్హతలు కలిగిన అభ్యర్థులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పిజిడిఎం, పీజీ డిప్లమో, డిప్లమో, ఐటిఐ పాసైన అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలను కల్పిస్తూ వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBPDCL) కాంట్రాక్టు విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సదర్ సంస్థాన్ నోటిఫికేషన్ లో పేర్కొంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. పదో తరగతి నుంచి వివిధ అర్హతలు కలిగిన అభ్యర్థులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను అందించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పిజిడిఎం, పీజీ డిప్లమో, డిప్లమో, ఐటిఐ పాసైన అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలను కల్పిస్తూ వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBPDCL)  కాంట్రాక్టు విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సదర్ సంస్థాన్ నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తంగా 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లమో, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 26వ తేదీ వరకు అవకాశం ఉంది. ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.29 వేల నుంచి రూ.94 వేల వరకు జీతాన్ని చెల్లించనున్నారు. 63 ఏళ్ల వరకు వయసు పరిమితి ఉంది. వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయాలని భావిస్తున్న పోస్టులు జాబితాలో జూనియర్ కన్సల్టెంట్, డిప్యూటీ కన్సల్టెంట్, ఏజెంట్ టీఈడబ్ల్యూబి తదితర ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.

ఆయా పోస్టులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే అసోసియేట్ పోస్టులు 73, అసిస్టెంట్ మ్యాగజైన్ పోస్టులు మూడు, ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఒకటి, స్పెషల్ ఆఫీసర్ పోస్టులు ఐదు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాలుగు, సూపర్వైజర్ పోస్టులు 12, మ్యాగజైన్ ఇన్చార్జి పోస్టులు నాలుగు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అండ్ డిపిడిహెచ్ పోస్టులు ఒకటి, సూపర్ ఇంటెండెంట్ అండర్ డిపి డిహెచ్ పోస్టులు ఒకటి, హెల్త్ ఆఫీసర్ అండర్ డిపి డిహెచ్ పోస్ట్ ఒకటి, సూపర్వైజింగ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి, అసిస్టెంట్ మైన్స్ సూపరిండెంట్ అండర్ డిపిడిహెచ్ పోస్టు ఒకటి, బ్లాస్టింగ్ ఇన్చార్జ్ అండర్ డిపిడిహెచ్ పోస్టు ఒకటి, సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ ఒకటి, డిప్యూటీ కన్సల్టెంట్ పోస్ట్ ఒకటి, జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు మూడు, ఏజెంట్ అండర్ టీఈడబ్ల్యూబి పోస్టులు ఒకటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు మే 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 26 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీటెక్, బిఈ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పిజిడిఎం, పీజీ డిప్లమో, డిప్లమో, ఐటిఐ, ఇంటర్, పదో తరగతి పాసై ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 63 ఏళ్లకు వయసు మించని అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. నోటిఫికేషన్ కోసం మరింత సమాచారానికి అఫీషియల్ వెబ్సైట్ https://www.wbpdcl.co.in సంప్రదించాలని సూచించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్