తప్పులపై ప్రశ్నిస్తే కేసులా.! హామీలపై నిలదీస్తే అరెస్టులా.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆరోపణ

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అధ్వానంగా తయారైందని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు పెడుతున్నారని, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించిన, ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొచ్చినా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

BRS Working President KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అధ్వానంగా తయారైందని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గురువారం స్పందించిన ఆయన ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు పెడుతున్నారని, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించిన, ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొచ్చినా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులపైన కేసులు పెడుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసులు మాకైతే, సూటు కేసులు మీకంటూ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితోపాటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చెయాలని డిమాండ్ చేశారు. ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా ఆఫీసులో కలిసేందుకు కూడా భయమా.? అని ప్రశ్నించారు. పట్టుకొని నిలదీస్తే అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే తమ ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని, ఇవేవీ ప్రజా గొంతుకులైన తమకు అడ్డం కావన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని,  పోరాడుతూనే ఉంటామన్నారు. 

కోటి అబద్దాల రేవంత్ ఆడబిడ్డలను కోటిశ్వరులను చేస్తావా.?

అద్దుమ రాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైడ్రాతో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్న నువ్వని కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ప్రశ్నించారు. మూసీలో ఆడ బిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ఎద్దేవా చేశారు. పేదింటి బిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ప్రశ్నించారు. నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్టును మాయం చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడులను ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించారు. తులం బంగారం పేరుతో ఆడ బిడ్డలను వంచించిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? ఆరోపించారు. నెలకు రూ.2500 పేరుతో చెవిలో పువ్వులు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా?, స్కూటిల పేరుతో కాలయాపన చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ఎద్దేవా చేశారు. పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ప్రశ్నించారు. బతుకమ్మ చీరలను బందుబెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా.? అంటూ ప్రశ్నించారు. రేవంత్ డమ్మీ పథకాలు గడపలు దాటవని, మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో భరోసా నిండిన బతుకుల్లో భయం నింపావని, సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావని, బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్