తల్లికి వందనం ఈ ఏడాది ఇక లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలకు నిర్ణయం

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా వారికి 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హామీల అమలకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసే దిశగా కూటమి నాయకులు ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా వారికి 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హామీల అమలకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసే దిశగా కూటమి నాయకులు ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వేసవి సెలవుల తరువాత తిరిగి పాఠశాలలు తెరిచే సమయంలో తల్లులు ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకంలో భాగంగా లబ్ధిని చేకూర్చునున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలల్లో 70 శాతం హాజరు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పథకంలో భాగంగా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్నవారికి తిరిగి పాఠశాలలు తెరిచే ముందు డబ్బులు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారన్న ఆశతో ఉన్న చాలామందికి ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. 

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ పథకం కోసం నిరీక్షిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో సుమారు 60 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద 15000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. వైసీపీ ప్రభుత్వం ఇంటిలో ఒక చిన్నారికి మాత్రమే ఈ పథకంలో భాగంగా లబ్ధిని అందించింది. కానీ కూటమి నాయకులు ఇంట్లో ఎందరు ఉంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామని వెల్లడించారు. దీంతో ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించడం పట్ల వారంతా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఒక ఏడాది నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు వాపోతున్నారు. అయితే పథకాన్ని అమలు చేయడానికి నిబంధనలను తెచ్చి అర్హులను అనర్హులుగా చేయకుండా ఉంటే చాలు అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్