తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఇక ఆస్తులు వెనక్కే.. కీలక చట్టాన్ని తెచ్చిన కేంద్రం.!

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల సంఖ్య పెరుగుతోంది. చిన్నప్పటి నుంచి వారు పెద్ద అయేంతవరకు ఆలనా పాలనా చూసిన తల్లిదండ్రులను చివరి దశలో చాలామంది వదిలించుకుంటున్నారు. కొందరు వేధింపులకు గురి చేస్తున్నారు. ఆస్తులు రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కనీస అవసరాలు కూడా తీర్చలేని విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఝలక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల సంఖ్య పెరుగుతోంది. చిన్నప్పటి నుంచి వారు పెద్ద అయేంతవరకు ఆలనా పాలనా చూసిన తల్లిదండ్రులను చివరి దశలో చాలామంది వదిలించుకుంటున్నారు. కొందరు వేధింపులకు గురి చేస్తున్నారు. ఆస్తులు రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కనీస అవసరాలు కూడా తీర్చలేని విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఝలక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారు ఇచ్చిన ఆస్తులు మాత్రమే అనుభవిస్తున్న వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు. తల్లిదండ్రులను పట్టించుకోను పక్షంలో వారిచ్చిన ఆస్తులపై పిల్లల హక్కులను రద్దుచేసి తిరిగి తల్లిదండ్రులకు ఆ ఆస్తులు పై హక్కులు కల్పించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్ డిడ్ కింద, సెటిల్మెంట్ కింద ఆస్తులు ఇస్తున్నారు. తరువాత తల్లిదండ్రులను పిల్లలు వదిలేసుకున్న పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇకపై ఇలాంటి రిజిస్ట్రేషన్లకు సెటిల్మెంట్లు, గిఫ్ట్ డీడ్లు రద్దు చేశారు. తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ వస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

తల్లిదండ్రులు సంరక్షణ చట్టం 2007లోని సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉంచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల నిర్లక్ష్యంపై తమ దృష్టికి వచ్చిన కేసులను విచారించి ఈ నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆర్డివోలకు అప్పజెప్పారు. ఆర్డీవో ఆదేశాలను రిజిస్ట్రేషన్లు శాఖ తమ కార్యాలయంలోని సాఫ్ట్వేర్ రికార్డుల్లోనూ పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్డీవో ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ హక్కులు మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం జారీచేసిన తాజా ఉత్తర్వులు వల్ల తల్లిదండ్రులు వద్ద ఆస్తులు పొంది వారిని నిర్లక్ష్యం చేసే వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు. ఈ నిర్ణయాన్ని కఠినంగా కేంద్రం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల వృద్ధులైన ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఎంతోమంది తమ తల్లిదండ్రుల వద్ద ఆస్తులును పొందేందుకు మొదట ఆప్యాయంగా నటిస్తూ, ఆ తర్వాత ఆస్తులు బదలాయించుకుని వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. తరహా కేసులో ఘననయంగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో జరిగిన జీవనాన్ని పొందేందుకు అవకాశం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్