కేసీఆర్‌ను తొక్కుకుంటూ వచ్చా.. తెలంగాణ గడ్డపై ఆ మొక్కను మొలవన్విను : సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన సంచలన వ్యాఖ్యలు చేవారు. కేసీఆర్‌ను తొక్కుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి కుర్చీ లాక్కుకున్నానని, కేసీఆర్‌ అనే మొక్కును తెలంగాణ గడ్డపై ఇక మొలవనివ్వని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో విజయోత్సవ సభను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను ఉద్ధేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌ హౌస్‌లో పడుకుని కేసీఆర్‌ ఏం కుట్రలు చేస్తున్నాడో తనకు తెలుసునన్నారు.

cm revanth reddy

సీఎం రేవంత్‌

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన సంచలన వ్యాఖ్యలు చేవారు. కేసీఆర్‌ను తొక్కుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి కుర్చీ లాక్కుకున్నానని, కేసీఆర్‌ అనే మొక్కును తెలంగాణ గడ్డపై ఇక మొలవనివ్వని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో విజయోత్సవ సభను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను ఉద్ధేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌ హౌస్‌లో పడుకుని కేసీఆర్‌ ఏం కుట్రలు చేస్తున్నాడో తనకు తెలుసునన్నారు. ఈ తరహా కుట్రలను ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చినట్టు పేర్కొన్నారు. దమ్ముంటే కేసీఆర్‌కు అసెంబ్లీకి రావాలని, ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడే రుణ మాఫీపై చర్చ పెడదామని స్పష్టం చేశారు. డేట్‌ నువ్వు చెప్పినా సరే, తనను చెప్పమన్నా సరే సిద్ధమని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. కేసీఆర్‌ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వనని, రాసి పెటుకోవాలని, కేసీఆర్‌ కాస్కో అంటూ సవాల్‌ చేశారు. నీ కష్టం ఏందో, బాధ ఏందో అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు.

ప్రజల్లోకి వచ్చి మాట్లాడకుండా ఇద్దరు చిల్లరగాళ్లను రోడ్డుపైకి వదిలిండు అంటూ కేసీఆర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరంగల్‌ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్‌ రూపురేఖలు మారాయని, పని చేసేవారి కాళ్లలో కట్టెలు పెడితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయినట్టు కేసీఆర్‌ మాట్లాడుతున్నాడని, కానీ, పది నెలల్లో తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛను పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదానీ, అంబానీలకే పరిమితమైన సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్తాయికి రాష్ట్ర మహిళలు ఎదుగుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఆడ బిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారని, రూ.500 కే ఆడ బిడ్డలకు గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తోందన్నారు. దేశంలో ఎక్కడైనా వీటిని అందిస్తున్నారని అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ తెలంగాణను తాగుబోతులు రాష్ట్రంగా మార్చాలనుకున్నారని, తాగు బోతుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లోనే ఉండడం మంచిదని, కావాల్సివన్నీ అక్కడికే పంపిస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ చేసే కుట్రలు, కుతంత్రాలను గుర్తించి ఊచలు లెక్కిస్తామని హెచ్చరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్