డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలు.. ఐడీబీఐ బ్యాంక్ నోటిఫికేషన్

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం ఉద్యోగాలు 1000 కాగా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలని వెల్లడించింది.

BANK JOBS

ప్రతీకాత్మక చిత్రం 

పోస్టు: ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ 

జీతం: ఎంపికైన మొదటి సంవత్సరం 29,000/- చొప్పున జీతం ఇస్తారు. రెండవ సంవత్సరం 31,000/- చొప్పున జీతం ఇస్తారు.

విద్యార్హత: డిగ్రీ 

వయసు: 20 నుండి 25 సంవత్యరాలు ఎస్సీ , ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్)లకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వారికి పదేళ్ల వయోసడలింపు

దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఫీజు: ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు రూ.250/- ఇతరులకు ఫీజు రూ.1050/-

పరీక్ష విధానం: మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలకు గానూ 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు తగ్గిస్తారు. 

నోటిఫికేషన్ తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేది: నవంబర్ 21

అప్లికేషన్ చివరి తేది: నవంబర్ 30

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్