|| నూతన సీఎస్ శాంతికుమారిని అభినందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ Photo: telangana cmo twitter ||
ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. గతంలో వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వర్తించారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా పనిచేశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. శాంతికుమారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం అభినందనలు తెలిపారు. సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటం, వెంటనే కేంద్రం ఆయన్ను రిలీవ్ చేయటం చకచకా జరిగిపోయాయి. దీంతో శాంతి కుమారిని సీఎం కేసీఆర్ సీఎస్ గా నియమించారు. ఈమె 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు.
సీఎస్ శాంతికుమారి బయోడేటా:
చదువు: ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ, ఎంబీఏ (అమెరికా)
వివిధ హోదాలు: ఐఏఎస్‌గా విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఐక్యరాజ్యసమితిలో: రెండేళ్లు పనిచేశారు.
సీఎం కార్యాలయంలో: నాలుగేళ్లు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
టీఎస్‌ఐపాస్‌లో: ఇండస్ట్రీ చేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించారు.