నేడు విజయవాడలో హైందవ శంఖారావం.. ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో దేశభక్తి, దైవభక్తి, సేవ భావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై మాట్లాడతారని విహెచ్పి రాష్ట్ర శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Hindava Sankharavam venue

హైందవ శంఖారావం జరగనున్న వేదిక

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో దేశభక్తి, దైవభక్తి, సేవ భావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై మాట్లాడతారని విహెచ్పి రాష్ట్ర శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సాధువులు, మఠాధిపతులు సహా ఐదు లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. విహెచ్పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ముఖ్యులు మిలింద్ పరాండే, కోటీశ్వర శర్మ, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిందా గిరి మహరాజ్ హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాది నుంచి హిందువులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.  సభకు 3300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొమ్మిది రైళ్లతోపాటు రెండు వేల బస్సులు, భారీగా కార్లు, ఇతర వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బందోబస్తుతోపాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

హైందవ శంఖారావ సభను రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. సభా ప్రాంగణాన్ని అత్యంత అందంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. సభ సాంస్కృతిక వేదికను పక్కపక్కనే ఏర్పాటు చేశారు. వేదికకు ఎదురుగా ఐదు బ్లాక్ లో 50 గ్యాలరీలను హైందవ సోదరుల కోసం ఏర్పాటు చేశారు. పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కాషాయ జండాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  సభకు వచ్చే హిందూ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరు ఇబ్బందులు పడకుండా వసతి, తాగునీరూ, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో 11 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడంతో పాటు వందకు పైగా భోజనం కౌంటర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలా ఉంటే అతిధులు, హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, వాలంటీర్లకు బస, ఆహారం, పార్కింగ్ తదితర వసతులకు ఉప్పలూరు - కేసరపల్లి మధ్య భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 35 వేల మందికి అవసరమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం తయారు చేసి వడ్డించేలా ఇక్కడ ఏర్పాటులో పూర్తి చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్