భారత్ సరిహద్దు వెంబడి రక్షణను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అమెరికన్ డిఫెన్స్ మేజర్ జనరల్ అటామిక్స్ నుంచి దాదాపు రూ.33,615 కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ డీల్ పై సంతకాలు చేశారు. అమెరికా నుంచి ఎంక్యూ-9బి సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ (సిసిఎస్) గత వారం ఆమోదం తెలిపింది.
ఎంక్యూ-9బి సాయుధ ప్రిడేటర్ డ్రోన్
భారత్ సరిహద్దు వెంబడి రక్షణను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతను పటిష్టం చేసిన భారత్.. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చైనా, పాకిస్తాన్ వెంబడి సరిహద్దులు, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సైనిక శక్తిని పెంచుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం ఆకాశంలో నిరంతరం నిఘా పెట్టే హంటర్ కిల్లర్ డ్రోన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అత్యాధునిక ఎంక్యూ-9బి సాయుధ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు అమెరికాతో కీలక ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. అమెరికన్ డిఫెన్స్ మేజర్ జనరల్ అటామిక్స్ నుంచి దాదాపు రూ.33,615 కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ డీల్ పై సంతకాలు చేశారు.
అమెరికా నుంచి ఎంక్యూ-9బి సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ (సిసిఎస్) గత వారం ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఈ డీల్ ఖరారైంది. ఈ 31 డ్రోన్లలో భారత్ నావికాదళానికి 15, వాయు సేనకు ఎనిమిది, సైన్యానికి ఎనిమిది చొప్పున డ్రోన్లు కేటాయించనున్నారు. ఈ డ్రోన్లు ఎక్కువ ఎత్తులోను ఏకబిగిన 35 గంటలకుపైగా గాల్లో ఎగర గలవు. నాలుగు హెల్ ఫైర్ క్షిపణులు, 450 కిలోల వరకు బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం వీటి సొంతం. దీనివల్ల శత్రు దేశాలపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని సరిహద్దుల్లో మోహరించడం ద్వారా సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేసుకోవచ్చని భారత్ భావిస్తోంది. ఒకవైపు చైనా నుంచి మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎప్పటికప్పుడు ముప్పును ఎదుర్కొంటూ ఉన్న భారత వీటి ద్వారా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తోంది. వీలైనంత వేగంగానే వీటిని భారత్ కు అందించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు వెంబడి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనా సైన్యం భారత్ సరిహద్దుల్లోకి వస్తూ కవ్వింపులకు పాల్పడుతోంది. దీనివల్ల ఇరుదేశాల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. వీటిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం అత్యాధునిక డ్రోన్లను వినియోగించనుంది. వీటి ద్వారా అవసరమైన సందర్భాల్లో తీవ్రమైన దాడులకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో సరిహద్దుల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతి స్థాయిలోని అధికారులకు అందించేందుకు అవకాశం ఉంటుందని రక్షణ రంగాన్ని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్లతో సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో భద్రత మరింత పటిష్టం కానుంది.