ప్రపంచంలోనే అనేక జాతులకు సంబంధించిన జీవరాశుల మనుగడ ప్రశ్నార్ధకమయింది. ఎన్నో జాతులు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో మానవజాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జురాసిక్ పార్క్ సినిమాలో మాదిరిగా చెట్టు జిగురులో ఇరుక్కుపోయిన ఒక దోమ నుంచి డైనోసార్ డీఎన్ఏను సేకరించి క్లోనింగ్ ద్వారా రాక్షస బల్లులను సృష్టిస్తారు.
5డి మెమురీ క్రిస్టల్
ప్రపంచంలోనే అనేక జాతులకు సంబంధించిన జీవరాశుల మనుగడ ప్రశ్నార్ధకమయింది. ఎన్నో జాతులు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో మానవజాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జురాసిక్ పార్క్ సినిమాలో మాదిరిగా చెట్టు జిగురులో ఇరుక్కుపోయిన ఒక దోమ నుంచి డైనోసార్ డీఎన్ఏను సేకరించి క్లోనింగ్ ద్వారా రాక్షస బల్లులను సృష్టిస్తారు. ఈ సినిమాలో అంతరించిపోయిన డైనోసార్లను ఎలా సృష్టించారో భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న మనుషులను కూడా పునః సృష్టించేలా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలను యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్నారు. మళ్లీ మానవజాతిని పునః సృష్టించడానికి సౌతాంప్టన్ పరిశోధకులు పూర్తిస్థాయి హ్యూమన్ జీనోమ్ ను ఒక 5 డి మెమురీ క్రిస్టల్ లో భద్రపరిచారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం జెనెటిక్ సమాచారాన్ని ఉపయోగించి మానవులను కృత్రిమంగా సృష్టించలేము. కానీ భవిష్యత్తులో ఆ స్థాయి టెక్నాలజీ ఉన్న జీవులుగాని యంత్రాలుగాని అంతరించిన మానవజాతిని మళ్లీ సృష్టించాలని భావిస్తే ఈ సమాచారం వారికి, వాటికి ఉపయోగపడుతుందన్న ఆశాభావంతో ఈ క్రిస్టల్ ను తయారు చేశారు. దీన్ని మెమురీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్కైవ్ అనే ప్రత్యేక టైమ్ క్యాప్సిల్స్ లో భద్రపరుస్తున్నారు.
ఈ టైమ్ క్యాప్సూల్ ఆస్ట్రియాలోని హాల్ స్టాట్ సాల్ట్ కేబులో ఉంది. ఇతర డేటా స్టోరేజీ ఫార్మాట్లలో భద్రపరిచిన డేటా కాలం గడిచే కొద్దీ డీగ్రేడ్ అవుతుందని, కానీ ఈ మెమురీ క్రిస్టల్ లో భద్రపరిచిన డేటా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వరకు భద్రంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 1000 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతను, గడ్డకట్టించే చల్లని మంటలను సైతం ఈ క్రిస్టల్ తట్టుకోగలదు. చదరపు సెంటీ మీటర్లకు 10 టన్నుల తాకిడిని సైతం భరించగలదు. దీర్ఘకాలంపాటు రేడియో ధార్మికతకు గురైనా దీనికి ఏమీ కాదు. ఒక్క 5డి మెమురీ క్రిస్టల్ లో 360 టెరాబైట్ల దాకా సమాచారాన్ని దాచుకోవచ్చు అని పరిశోధన సాగించిన పరిశోధకులు వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ 5డి మెమొరీ క్రిస్టల్ మోస్ట్ డ్యూరబుల్ డేటా స్టోరేజ్ మెటీరియల్ గా 2014లో గిన్నిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సౌతాంప్టన్ పరిశోధకులు సాగించిన ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. భవిష్యత్తులో మానవజాతి అంతరించిపోయిన మరోసారి మానవజాతిని ప్రతి సృష్టించేందుకు సాగిస్తున్న ఈ పరిశోధన పట్ల వివిధ దేశాలకు చెందిన పరిశోధకులు ఆసక్తిగా ఫలితాలను చూస్తున్నారు. సానుకూలమైన రీతిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించడంతో దీని పట్ల ప్రపంచ దేశాలకు చెందిన వివిధ పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి వివరాలను తెలుసుకుంటున్నారు.