వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ ప్రక్రియను సోమవారం సుప్రీంకోర్టు జరిపింది.
ప్రతీకాత్మక చిత్రం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ ప్రక్రియను సోమవారం సుప్రీంకోర్టు జరిపింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామకృష్ణరాజు తరఫు లాయర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. దీంతో సుప్రీంకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అదే సమయంలో ట్రయల్ వేగంగా సాగాలని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం ఆదేశాలను ఇచ్చింది. జగన్ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని, ప్రజా ప్రతినిధుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. రైల్ కోర్ట్ అలా విచారణ జరుపుతుందో లేదో హైకోర్టు పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది.
కాబట్టి పిటిషన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్టు భావించాల్సి ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పక్షాన దేవుడు నిలబడ్డాడు అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు లాయర్ ప్రకటించారు.