హెచ్పీసీఎల్ లో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే.?

హెచ్పీసీఎల్ సంస్థ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. ఆయా అభ్యర్థులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముంబై లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్, రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

హెచ్పీసీఎల్ సంస్థ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. ఆయా అభ్యర్థులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముంబై లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్, రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొత్తంగా 63 కాలేలను భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే మెకానికల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మెకానికల్ విభాగానికి 11, ఎలక్ట్రికల్ విభాగానికి 17 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్కు సంబంధించి ఆరు పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి ఒక పోస్టు, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. 60 శాతం మార్పులతో అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

మార్చి 26న నోటిఫికేషన్ విడుదల అయ్యి దరఖాస్తులను హెచ్పీసీఎల్ తీసుకుంటుంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సదరు సంస్థ కోరుతోంది. దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 ఏళ్ళు మించ రాదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబిసి అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 15 ఏళ్ల వరకు వైశ్య సడలింపును ఇచ్చారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30 వేల నుంచి రూ.1,20,000 వేల వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మరిన్ని వివరాలకు http://Hindustanpetroleum.com సంప్రదించాలని సంస్థ సూచించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్