హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ అదే.!

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 63 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లమో ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే ఈ దరఖాస్తు చేసేందుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబిసి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 63 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లమో ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే ఈ దరఖాస్తు చేసేందుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబిసి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సిబిటి, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

పోస్టులను వివిధ కేటగిరీలకు సంబంధించి కేటాయింపులను పరిశీలిస్తే.. ఎస్సీలకు 9, ఎస్టీలకు నాలుగు, ఓబీసీలకు 17, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఆరు, యు ఆర్ అభ్యర్థులకు 27 పోస్టులను కేటాయించారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) విభాగానికి సంబంధించి 11 పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జనరల్/ఓబిసి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్పులు పొందాలి. ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి అభ్యర్థులు 50% మార్పులతో మూడు ఏళ్ల ఫుల్ టైం రెగ్యులర్ డిప్లమో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆయా పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల వయసు మాత్రమే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంది. ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

ఆయా పోస్టులకు ఎంపికయ్య అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనాన్ని చెల్లిస్తారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులను ఆరు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జనరల్, ఓ బి సి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్పులతో, ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి అభ్యర్థులు 50 శాతం మార్పులతో మూడేళ్ల ఫుల్ టైం రెగ్యులర్ డిప్లమో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 ఏళ్ల వయవ సడలింపు వర్తిస్తుంది. వీరికి కూడా నెలకు వేతనం 30000 నుంచి 1,20000 వరకు చెల్లిస్తారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ విభాగానికి సంబంధించి ఒక పోస్ట్ భర్తీ చేయనున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు ఎస్సీ, ఎస్టీ పిడబ్ల్యుడి 50 శాతం మార్కులతో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లమో ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్లలోపు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యుడి అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్