తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువత కోసం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి అనుహ్యా రీతిలో స్పందన లభిస్తుంది. ఈ పథకంలో భాగంగా లబ్ది పొందేందుకు లక్షలాదిమంది యువత దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించిన వారం రోజుల్లోనే మీసేవ కేంద్రాలకు 13.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దరఖాస్తుదారులకు మరో గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్న వారిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారు కూడా కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చని ప్రకటించింది.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువత కోసం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి అనుహ్యా రీతిలో స్పందన లభిస్తుంది. ఈ పథకంలో భాగంగా లబ్ది పొందేందుకు లక్షలాదిమంది యువత దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించిన వారం రోజుల్లోనే మీసేవ కేంద్రాలకు 13.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దరఖాస్తుదారులకు మరో గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న వారిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారు కూడా కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చని ప్రకటించింది. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసే దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టి, బీసీ మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకానికి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 13.45 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 6.20 లక్షల దరఖాస్తులకు ప్రభుత్వం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇప్పటివరకు రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం కల్పించింది. రేషన్ కార్డు లేని వారు కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తాజాగా కల్పించింది. ఈ పథకంలో భాగంగా 6 వేల కోట్లతో వివిధ రకాల లబ్దిని చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే క్రమంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రేషన్ కార్డులు విషయంలో ఈ సమస్యలు తీవ్రమవుతుండడంతో రేషన్ కార్డులో లేకుండానే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం తాజాగా కల్పించింది. దరఖాస్తు చేసుకునే గడువు కూడా కొద్ది రోజుల కిందటే ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేయాల్సిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొడిగించింది.
ఈ పథకం కింద ఎంపికైన వారికి జూన్ రెండో తేదీ నుంచి తొమ్మిది వరకు మంజూరు పత్రాలు అందించనున్నారు. ఎంపికైన వారికి దాదాపు రెండు వారాలపాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు ట్రైనింగ్ అందిస్తారు. ఈ పథకంలో అర్హులైన యువతకు 50 వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. యువతను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వం భారీగా నిధులు కూడా ఈ పథకానికి కేటాయించడంతో దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.