యుపిఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూతో జాబ్ కొట్టే అవకాశం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్) బీటెక్, ఎల్.ఎల్.బి పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మే ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వివిధ కేటగిరీలకు సంబంధించి 111 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వివిధ రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్) బీటెక్, ఎల్.ఎల్.బి పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మే ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వివిధ కేటగిరీలకు సంబంధించి 111 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వివిధ రకాల ఉద్యోగాలను  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో సిస్టమ్ అనలిస్ట్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ (నావెల్ క్వాలిటీ అష్టోరియన్స్ ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజనీర్ (నావల్ క్వాలిటీ అష్యూరెన్స్ మెకానికల్), జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్) పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆయా ఖాళీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే సిస్టం అనలిస్టు పోస్టు ఒకటి, డిప్యూటీ కంట్రోలర్ పోస్టులు 18, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఒకటి, అసిస్టెంట్ ఇంజనీర్ నావెల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలక్ట్రికల్ పోస్టులు ఏడు, అసిస్టెంట్ ఇంజనీర్ నావల్ క్వాలిటీ అష్యూరెన్స్ మెకానికల్ పోస్ట్ ఒకటి, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 13, అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ) బ్రాంచ్ పోస్టులు నాలుగు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 66 భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

మే ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్), బీటెక్ లేదా బిఎస్సి (ఇంజనీరింగ్), ఎల్.ఎల్.బిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ పరిగణలోకి తీసుకుంటారు. పోస్టు ఆధారంగా వయోపరిమితి సడలింపులు కూడా వర్తిస్తాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 30 నుంచి 40 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పోస్టులకు 40 నుంచి 45 ఏళ్లు, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కు 30 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) కు 30 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) కు 30 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజనీర్ (కెమికల్) కు 30 ఏళ్లు, డిప్యూటీ కంట్రోలర్ పోస్ట్ కు 35 నుంచి 45 ఏళ్లు, సిస్టం అనలిస్టుకు 35 ఏళ్లు వయస్సు ఉండాలి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in చూడాలి. మొత్తంగా 11 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు మే ఒకటో తేదీ చివరి రోజు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్