జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన షాపింగ్ మాల్

జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోనే ఉన్న విజయ షాపింగ్ మాల్ లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. షాపింగ్ మాల్ లో ఎగసి పడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

Blazing flames

ఎగసిపడుతున్న మంటలు

జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోనే ఉన్న విజయ షాపింగ్ మాల్ లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. షాపింగ్ మాల్ లో ఎగసి పడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదఘట్టంలో విజయా షాపింగ్ మాల్ తోపాటు పక్కనే ఉన్న లక్ష్మీ షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్త నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే భారీగా నష్టం జరిగిపోయినట్లు భావిస్తున్నారు. సమయానికి ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ మంటల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ రెండు షాపింగ్ మాల్స్ లో భారీగా నష్టం వాటిల్లింది. అయితే సమాచారం అందిన వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఇతర షాపులకు ఈ మంటలు వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడంలో విజయం సాధించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

షార్ట్ సర్క్యూటే కారణమా.? ఎవరైనా ఉద్దేశం పూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా.?అన్నదానిపై విచారణ సాగిస్తున్నారు. షాపింగ్ మాల్ యజమాని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేరుస్తున్నారు. ఈ ఘటనలో ఎంత నష్టం జరిగిందన్న దానిపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ప్రస్తుతం పోలీసులు అక్కడ వివరాలు సేకరిస్తున్నారు.   ఈ పట్టణంలోని ప్రధానమైన షాపింగ్ మాల్ కావడంతో నష్టం తీవ్రత అధికంగానే ఉంటుందని భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సిబ్బంది ఎవరు షాపింగ్ మాల్ లో లేకపోవడం కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు దోహదం చేసింది అని పోలీసులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఒకే ఫైర్ ఇంజన్ రావడంతో కొంత ఇబ్బంది ఎదురయింది. అనంతరం స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ప్రయత్నం చేశాయి. ఈ ప్రమాదంలో రెండు వస్త్ర దుకాణాలు పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.10 కోట్ల పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్