హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీగా తగ్గింపు ఆఫర్.. వీరికి మాత్రమే.!

ప్రముఖ మోటార్ సంస్థ హీరో తమకు చెందిన ఎలక్ట్రికల్ స్కూటర్ వీడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. గడిచిన కొన్నాళ్లుగా ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వాహన ఉత్పత్తి సంస్థలు కూడా వినియోగదారులకు మరింత ప్రోత్సాహకాలను అందించేందుకు ధరలను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరో నుంచి వస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ పై భారీగా తగ్గింపు ధరను ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్కూటర్ టీవీఎస్ iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకుగా మార్కెట్లో లభిస్తుందని ఆ సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ధరల్లో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. vida V2 లైట్, ప్లస్, బ్రో అనే మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ లభ్యం అవుతోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మోటార్ సంస్థ హీరో తమకు చెందిన ఎలక్ట్రికల్ స్కూటర్ వీడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. గడిచిన కొన్నాళ్లుగా ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వాహన ఉత్పత్తి సంస్థలు కూడా వినియోగదారులకు మరింత ప్రోత్సాహకాలను అందించేందుకు ధరలను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరో నుంచి వస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ పై భారీగా తగ్గింపు ధరను ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్కూటర్ టీవీఎస్ iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకుగా మార్కెట్లో లభిస్తుందని ఆ సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ధరల్లో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. vida V2 లైట్, ప్లస్, బ్రో అనే మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ లభ్యం అవుతోంది. ఈ మూడింటి ధరలను తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది. వీడా V2 లైటుకు రూ.22 వేలు, విడా ప్లస్ కు రూ.32 వేలు, వీడా V2 ప్రోకు రూ.14,700 మేరా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రికల్ స్కూటర్లు విక్రయిస్తున్న సంస్థల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. విభిన్నమైన మోడల్స్ ను పలు ఫీచర్స్ తో ఆయా ఎలక్ట్రికల్ వాహన సంస్థలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ విక్రయాలను భారీగా పెంచుకునేందుకు తగ్గింపు ధరలను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరో సంస్థ భారీగా తగ్గింపు ధరలను తమకు చెందిన మూడు ఎలక్ట్రికల్ స్కూటర్లు పై ప్రకటించింది. 

ప్రస్తుత మార్కెట్లో vida V2 lite 2.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని రేంజ్ 94 కిలోమీటర్లు. దీని గరిష్ట వేగం గంటకు 69 కిలోమీటర్లు గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే ఇందులో 7 అంగుళాల TFT డిస్ ప్లే, LED డిస్ ప్లే, LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, రీ జనరేటర్ బ్రేకింగ్, కీ లెస్ ఎంట్రీ, రెండు రైడింగ్ మోడ్లు (ఎక్కువ మరియు రైడ్) ఉన్నాయి. వీడా V2 ప్లస్ 3 44 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని రేంజ్ 143 కిలోమీటర్లు. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, వాహన టెలిమాటిక్స్ ఉన్నాయి. vida V2 ప్రోలో 3.94 kWh బ్యాటరీ ఉంది. దీని పరిధి 165 కిలోమీటర్లు. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల తో ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ప్రకటించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్