ఏపీలో మద్యం దుకాణాలకు భారీగా డిమాండ్.. ప్రభుత్వానికి 18 వేల కోట్ల ఆదాయం

ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. మరో రెండు రోజులు గడువు పెంచింది. ఈ నేపథ్యంలోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు కారణంగా ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో 113 దుకాణాల కోసం 6000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

 liquor store

నూతన మద్యం షాపు

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అమలు చేయబోతున్న మద్యం విధానంలో భాగంగా మద్యం షాపులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంది. ఇందుకోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న దుకాణాల కోసం సుమారు లక్ష దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు లక్షల రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నాన్ రిఫండబుల్ గా పేర్కొంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచాయి. ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని విక్రయించకపోవడంతో పాటు ధరలు భారీగా పెంచేయడం పట్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మధ్యము విధానంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవసరమైన నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. తొలుత ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. మరో రెండు రోజులు గడువు పెంచింది. ఈ నేపథ్యంలోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు కారణంగా ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో 113 దుకాణాల కోసం 6000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా దరఖాస్తులో ఎన్ని అర్హత ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. అన్ని సక్రమంగా ఉంటే వాటిని తరువాత దశ ఫిల్టర్ వేషం కోసం పంపించమన్నారు మిగతా వాటిని తిరస్కరిస్తారు.

అర్హత ఉన్న వాటిని ఈనెల 14వ తేదీని లాటరీ తీసి షాపులను కేటాయించనున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా షాపులను వేలం వేసి కేటాయించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి చెప్పింది. దీంతో దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ నూతన మద్యం దుకాణాల కోసం వేలం చేసే ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో రెండు రోజులు పెంచింది. మొదట్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే అభ్యర్థులను స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడంతో దరఖాస్తులు మళ్లీ భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాల కోసం సుమారు 90,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 14వ తేదీన అధికారులు లిక్కర్ షాపుల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తులను లాటరీ తీయనున్నారు. లాటరీలో దుకాణాలు పొందిన యజమానులకు ఈనెల 15వ తేదీ నుంచి సర్టిఫికెట్లను అధికారులు అందించరున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన మద్యం విధానం వల్ల సుమారు 1800 కోట్ల రూపాయలు ఆదాయం రావడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్