హెచ్పి సంస్థ సరికొత్త ఫీచర్లతో అధునాతనమైన లాప్టాప్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన ఫీచర్లు దీని సొంతం. అలాగే గేమింగ్ కమ్యూనిటీ కోసం ఇది అత్యద్భుతమైన లాప్టాప్ గా ఆ సంస్థ పేర్కొంది. హెచ్పి తన ఫ్లాగ్షిప్ గేమింగ్ లాప్టాప్ ఒమెన్ మ్యాక్స్ 16 ను భారత్లో లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ లాప్టాప్. ఆత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లు, బ్లాక్ వెల్ ఆర్కిటెక్చర్ తో కూడిన సరికొత్త ఎన్వీడియో జి ఫోర్స్ ఆర్టిఎక్స్ 5000 సిరీస్ జిపియు కలిగిన ఈ ల్యాప్టాప్ ను భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ కమ్యూనిటీ కోసం రూపొందించారు. ఇందులో ఉన్న ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫీచర్లు విషయానికి వస్తే హెచ్పి ఓమన్ మ్యాక్స్ 16 లాప్టాప్ ఇంటెల్ 24 కోర్.. కోర్ ఆల్ట్రా 9-275HX ప్రాససర్ తో నడుస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
హెచ్పి సంస్థ సరికొత్త ఫీచర్లతో అధునాతనమైన లాప్టాప్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన ఫీచర్లు దీని సొంతం. అలాగే గేమింగ్ కమ్యూనిటీ కోసం ఇది అత్యద్భుతమైన లాప్టాప్ గా ఆ సంస్థ పేర్కొంది. హెచ్పి తన ఫ్లాగ్షిప్ గేమింగ్ లాప్టాప్ ఒమెన్ మ్యాక్స్ 16 ను భారత్లో లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ లాప్టాప్. ఆత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లు, బ్లాక్ వెల్ ఆర్కిటెక్చర్ తో కూడిన సరికొత్త ఎన్వీడియో జి ఫోర్స్ ఆర్టిఎక్స్ 5000 సిరీస్ జిపియు కలిగిన ఈ ల్యాప్టాప్ ను భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ కమ్యూనిటీ కోసం రూపొందించారు. ఇందులో ఉన్న ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫీచర్లు విషయానికి వస్తే హెచ్పి ఓమన్ మ్యాక్స్ 16 లాప్టాప్ ఇంటెల్ 24 కోర్.. కోర్ ఆల్ట్రా 9-275HX ప్రాససర్ తో నడుస్తుంది. ఎన్విడియో ఆర్టిఎక్స్ 5080 జిపియుతో అసాధారణమైన వేగాన్ని, గ్రాఫిక్స్ ను అందిస్తుంది. ఇది 64 జిబి డిడిఆర్5 ర్యామ్, 1 TB PCIC జెన్ 5 SSD వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ లాప్టాప్ 16 అంగుళాల డిస్ ప్లే 240 Hz రిఫ్రెస్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, స్క్రీన్ తీరంగును తొలగించేందుకు వేరియబుల్ రిఫరెన్స్ రేట్ కలిగి ఉంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ హెచ్పి ఓమన్ ఏఐ బీటా. ఇది ఒక క్లిక్ తో గేమ్ ప్లే నమూనాల ఆధారంగా ఓఎస్, హార్డ్వేర్, గేమ్ సెట్టింగ్లను డైనమిక్ గా సర్దుబాటు చేసే ఏఐ ఆప్టిమైజేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం కౌంటర్ స్ట్రైక్ 2కి సపోర్ట్ చేస్తున్న ఈ సాధనం.. ఇతర టైటిల్స్ కు విస్తరించే హామీతో మాన్యువల్ సర్దుబాట్లు లేకుండా ఫ్రేమ్ రేట్లు, థర్మల్ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది. గేమర్లు అత్యుత్తమ పనితీరు కోసం పవర్, థర్మల్ సెట్టింగులను ఫైన్ ట్యూన్ చేయడానికి ఓమన్ గేమింగ్ హబ్ ఆన్ షెడ్ మోడ్ వీలు కల్పిస్తుంది. సిపియు జిపియు కలగలిసిన దీని 20 ఓట్ల పవర్ డ్రా నిర్వహణకు ఓమన్ మ్యాక్స్ 16 అధునాతన ఉమెన్ టెంపెస్ట్ కూలింగ్ ప్రో ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. ఇందులో వేపర్ చాంబర్, డ్యూయల్ ఫ్యాన్స్, హీట్ డిస్ప్లేషన్ కోసం లిక్విడ్ మెటల్, థర్మల్ గ్రీస్ హైబ్రిడ్ ఒమెన్ క్రెయో కాంపౌండ్ ఉన్నాయి. ఫ్యాన్ క్లీనర్ టెక్నాలజీ ఫ్యాన్ డిసనో రివర్స్ చేసి దుమ్ము లోపలికి చేరకుండా నిరోధిస్తుంది. షరామిక్ వైట్ లేదా షాడో బ్లాక్ మెటల్ చాసిస్ ఇందులో ఉంది. ఆర్జిబి కీబోర్డ్, ఐచ్చిక ఆర్జీబి లైట్ బార్ ఉన్నాయి. 1080 p ఫుల్ హెచ్డి ఐఆర్ కెమెరా, నైస్ రెడక్షన్, క్లియర్ స్ట్రీమింగ్ కోసం డ్యూయల్ అరె మైక్రోఫోన్ కూడా ఇందులో ఉన్నాయి. హెచ్పి ఓమన్ మ్యాక్స్ 16 లాప్టాప్ ధర రూ.3,09,99 గా ఉంది. ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఉమెన్ మ్యాక్స్ 16 ఏ ఐ ఆధారిత ఆప్టిమైజేషన్, ఎలైట్ పనితీరుతో లేనమయ్య గేమింగ్ సరిహద్దులను చెరిపేస్తుంది అని ఈ సంస్థ అధికారులు వెల్లడించారు. విభిన్నమైన అవసరాలకు దీనిని వినియోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.