ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నవాళ్లు రుణం పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. సాధారణంగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఈ రుణం పొందేందుకు అవరోధంగా నిలుస్తాయి. ఎఫ్డిని రద్దు చేస్తేనే శిక్షుడు డిపాజిట్ పై రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే సరికొత్త నిబంధనల ప్రకారం ఎఫ్డిని రద్దు చేయకుండానే రుణం పొందే అవకాశం లభిస్తుంది. దానిపైనే లోన్ / ఓవర్ డ్రాఫ్ట్ పొందే సౌలభ్యం కూడా ఉంది. దీనివల్ల ఫిక్స్డ్ డిపాజిట్ ను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వ్యాల్యూకు తగ్గట్టుగా బ్యాంకు లోన్ మంజూరు చేస్తుంది. ఈ రుణం కూడా అత్యంత సులభంగా లభిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నవాళ్లు రుణం పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. సాధారణంగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఈ రుణం పొందేందుకు అవరోధంగా నిలుస్తాయి. ఎఫ్డిని రద్దు చేస్తేనే శిక్షుడు డిపాజిట్ పై రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే సరికొత్త నిబంధనల ప్రకారం ఎఫ్డిని రద్దు చేయకుండానే రుణం పొందే అవకాశం లభిస్తుంది. దానిపైనే లోన్ / ఓవర్ డ్రాఫ్ట్ పొందే సౌలభ్యం కూడా ఉంది. దీనివల్ల ఫిక్స్డ్ డిపాజిట్ ను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వ్యాల్యూకు తగ్గట్టుగా బ్యాంకు లోన్ మంజూరు చేస్తుంది. ఈ రుణం కూడా అత్యంత సులభంగా లభిస్తుంది. ఇచ్చిన రుణానికి ప్రతిగా బ్యాంకులో కొంత వడ్డీని వసూలు చేస్తాయి. మీకు ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే డబ్బు అవసరమైనప్పుడు ఆ ఎఫ్డిని హామీగా పెట్టి మూడు నెలల నుంచి పది సంవత్సరాలు కాలానికి రుణం తీసుకోవచ్చు. ఇందుకోసం వివిధ బ్యాంకులు కనిష్టంగా మూడు నుంచి గరిష్టంగా 7.85 శాతం వరకు ఒడ్డు రేటుతో రుణాలు మంజూరు చేస్తాయి.
బ్యాంకు విధానం, రుణాన్ని తిరిగి తీర్చే కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. అంతేకాకుండా రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ కూడా రుణ రేటు మీద ప్రభావం చూపుతాయి. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డి రుణాలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పలు విధాలుగా ఉన్నాయి. బంధన్ బ్యాంకు మూడు నుంచి 7.85% వడ్డీరేట్లు వసూలు చేస్తుంది. యూనియన్ బ్యాంకు 3.50 శాతం నుంచి 6.50 శాతం, కర్ణాటక బ్యాంకు 4 శాతం నుంచి 5.80 శాతం, కోటక్ మహేంద్ర బ్యాంక్ 4 నుంచి 6.20 శాతం, ఏయూ స్మైల్ ఫైనాన్స్ బ్యాంకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 4.50 శాతం నుంచి 6.50 శాతం వరకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.50 శాతం నుంచి 6 శాతం వరకు, ఐసిఐసిఐ బ్యాంక్ 4.50 శాతం నుంచి 6.90 శాతం వరకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు 4.50 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడాది నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో 7.25% నుంచి 7.75% వార్షిక వడ్డీ రేటు తో రుణాలు మంజూరు చేస్తుంది.