|| ప్రతీకాత్మక చిత్రం ||
ఇంటిలో గార్డెన్ ఏర్పరచుకోవడం అంటే అందరికీ ఇష్టమే.. అయితే మనం పెంచుకునే కొన్ని ముక్కల వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకువచ్చేవి ఉంటాయి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయట..
గోరింట :
మగువలకు ఎంత ఇష్టమైన గోరింటాకు చెట్టు ఇంటి ఆవరణంలో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకనే గోరింట చెట్టుని ఇంటి ఆవరణంలో పెంచుకోకూడదు.
ఎర్రని రంగు పూల చెట్లు :
ఎర్రని రంగు పూల చెట్లను ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వల్ల ఆ కుటుంబంలోని వ్యక్తుల మనస్తత్వం పై ప్రభావం చూపిస్తుంది. అందుకని ఇంటి ఆవరణంలో ఎర్రని రంగు పూల చెట్లను పెంచుకోకపోవడం మంచిది.
పొడవైన చెట్లు :
ఇంటి ఆవరణంలో ఇంటికంటే పొడవుగా ఉండే చెట్లను పెంచడం వల్ల ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అలాగే ఈశాన్య, తూర్పు దిక్కులకు అసలు పొడవాటి మొక్కలను పెంచకూడదు. దీనివల్ల ఇంటి వాస్తుపై ప్రభావం చూపిస్తుంది.
ఎండిన మొక్కలు :
ఇంటి ఆవరణంలో ఎండిపోయిన మొక్కలు, చనిపోయిన మొక్కలు ఉండటం వల్ల అందులోని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
తాటి చెట్టు :
తాటి చెట్టును ఇంటి ఆవరణంలో పెంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా కలిగిస్తుంది అందువల్ల ఇంటి ఆవరణంలో తాటిచెట్టు ఉండకుండా చూసుకోవడం ఉత్తమం.
చింత చెట్టు :
చింత చెట్టు ఇంటి ఆవరణంలో ఉండడం వల్ల ఇంట్లోనే ఆనందాన్ని అంతా అపహరిస్తుందని నమ్మకం అందుకని ఇంటి ఆవరణంలో చింత చెట్టు లేకుండా చూడడం మంచిది అలాగే వీటిని సాధ్యమైనంత వరకు ఇంటి పరిసరాలకు దూరంగా నాటడం మంచిది.
ముళ్ళు కలిగిన మొక్కలు :
బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అలాగే వీటిని సోకేష్ గాడినర్ గా కూడా అసలు పెంచుకోకూడదు. అయితే ముళ్ళముక్కలు కలిగిన గులాబీ మాత్రం ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి నష్టం లేదు.