||ప్రతీకాత్మక చిత్రం||
హైదరాబాద్ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. హోలీ పండగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా ఈ రోజు(మార్చి 6) సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు హోలీ పండగ సందర్భంగా మద్యం షాపులను మూసివేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. వైన్ షాపులు మూసేయాలని షాప్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. హోలీ సందర్భంగా గొడవ పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని గొడవలకు పాల్పడవద్దని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వైన్ షాపులను మూసేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు.
.jpg)