చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. తొలి వాణిజ్య స్పేస్ వాక్ విజయవంతం

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేస్తూ వస్తున్న స్పేస్ వాక్ ను తన పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా వాణిజ్యపరంగా నిర్వహించింది. వ్యోమగాములు కానీ ఇద్దరు వ్యక్తులతో స్పేస్ వాక్ చేయించింది.

Astronauts participating in space walks

స్పేస్ వాక్ లో పాల్గొన్న వ్యోమగాములు

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేస్తూ వస్తున్న స్పేస్ వాక్ ను తన పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా వాణిజ్యపరంగా నిర్వహించింది. వ్యోమగాములు కానీ ఇద్దరు వ్యక్తులతో స్పేస్ వాక్ చేయించింది. ఆ సంస్థ చేపట్టిన పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా అమెరికాకు చెందిన అపర కుబేరుడు పైలెట్.. జురెడ్ ఐజక్ మ్యాన్ (41) భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఇంచుమించుగా 4:30 గంటల సమయంలో భూమికి 700 కిలో మీటర్ల ఎత్తున క్రూ డ్రాగన్ వ్యోమ నౌక నుంచి బయటకు వచ్చి స్కైవాకర్ హ్యాండ్ రైయిల్ సిస్టమ్ ద్వారా తొలి కమర్షియల్ స్పేస్ వాక్ చేసి చరిత్రలో నిలిచారు. జారేడ్ తోపాటు అదే వ్యోమనౌకలో వెళ్లిన మిగతా ముగ్గురిలో సారా గిల్లిస్ అనే మహిళ కూడా కొంతసేపు స్పేస్ వాక్ చేసింది. ఆమె స్పేస్ ఎక్స్ ఇంజనీర్. భవిష్యత్తులో చంద్రుడి మీదకి, కుజుడి మీదకు వెళ్లి దీర్ఘకాలంపాటు ఉండే మిషన్లను నిర్వహించే యోచనలో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ వ్యోమగాములు కోసం ప్రత్యేకమైన ఈవీఏ సూట్లను అభివృద్ధి చేసింది. ఈవిఎ సూట్లంటే ఎక్స్ట్రా వెహిక్యూలార్ యాక్టివిటీ సూట్లు. అంటే వ్యోమగాములు, వ్యోమనౌకల నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే పీడనాన్ని తట్టుకునేలా రూపొందించిన సూట్లు. వీటిని పరీక్షించేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ ఈ మిషన్ ను నిర్వహించింది. ఇది విజయవంతం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

తాజా స్పేస్ వాక్ విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎర్త్ ఆర్బిట్ కు ఆవల వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు మార్గం సుగమమైనట్టు అయింది. కమర్షియల్ స్పేస్ వాక్ లను సాకారం చేసే దిశగా స్పేస్ ఎక్స్ సంస్థ చారిత్రాత్మకమైన ఈ పోలారి డాన్ మిషన్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫాల్కన్  9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో బిలియనీర్ జురేడ్ ఐజాక్ మాన్ నేతృత్వంలో పైలెట్ స్కాట్ కిడ్ పోటీట్, స్పేస్ ఎక్స్ ఇంజినీర్లు సారా గిల్లిస్, అన్నా మెనోన్ బృందం అంతరిక్షానికి చేరుకుంది. మూడో రోజు భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో జురేడ్, సా గిల్లీస్ చెరో 12 నిమిషాలు చొప్పున స్పేస్ వాక్ చేశారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన స్కై వాకర్ హ్యాండ్ రైల్ సిస్టం సాయంతో స్పేస్ వాక్ లో పాల్గొన్నారు. వ్యోమ నౌక నుంచి దూరంగా వెళ్లిపోకుండా ఉండేలా తమను తాళ్లతో కట్టి ఉంచుకొని కాళ్లు, చేతులు శరీరాన్ని కదిలించి చూశారు. మిగతా ఇద్దరూ స్పేస్ క్రాఫ్ట్ లోనే ఉండి పర్యవేక్షించారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపితే అక్కడ ఎక్కువ సమయంపాటు ఉపయోగించేందుకు వీలుగా ఉండేలా తయారుచేసిన ఎక్స్ట్రా హిక్యులర్ యాక్టివిటీ సూట్లను వీరు ధరించి ఈ సందర్భంగా టెస్ట్ చేశారు. దీని తర్వాత మరో రెండు మిషన్లను చేపట్టనున్నట్లు స్పేస్ ఎక్స్ కంపెనీ వెల్లడించింది. ఏది ఏమైనా ఎలాన్ మస్క్ తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసే క్రమంలో తొలి విజయాన్ని సాధించారని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్