Wayanad Landslides:వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రదేశం..ఇస్రో విడుదల చేసిన ఫోటోలు ఇదిగో

వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రదేశం చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.

Wayanad

ప్రతీకాత్మక చిత్రం 

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో గత మంగళవారం (జూన్ 30) అర్ధరాత్రి వరుసగా 3 కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విపత్తులో 280 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వయనాడ్ లో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం సంభవించింది. దీని కారణంగా వాయనాడ్‌లోని మెప్పాడి, ముండక్కై, సూరల్‌మలైతో సహా గ్రామాల నుండి ఇళ్ళు, నివాస భవనాలు, పాఠశాలలు, దేవాలయాలు, వాహనాలు మొదలైనవి కొట్టుకుపోయాయి . ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1000 మందికి పైగా శిథిలాల నుండి రక్షించారు. తీవ్రంగా గాయపడిన బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది తమ ఇళ్లు కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ  జీవిస్తున్నారు. వాలంటీర్లు బాధిత ప్రజలకు అవసరమైన ఆహారం, మందులు, వస్తువులను అందిస్తున్నారు. దేశం నలుమూలల నుండి వాయనాడ్ కోసం నిధులు సేకరిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న వేళ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు వాయనాడ్ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన అధిక నాణ్యత గల ఉపగ్రహ చిత్రాలు వాయనాడ్‌లో తీవ్ర నష్టాన్ని వెల్లడిస్తున్నాయి.ఇరువైపూజ నదికి అడ్డంగా 86,000 చదరపు మీటర్లు, 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిధిలాల మిగిల్చిన నష్టాన్ని చూడవచ్చు. సూరల్‌మలై ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు సూచిస్తున్నాయి. 

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఉపగ్రహ చిత్రాల ప్రకారం 1,550 మీటర్ల ఎత్తులో సంభవించింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన శిథిలాలన్నీ ఇరువైపూజ నది ప్రవాహాన్ని విస్తరించాయని ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి. దీంతో నది ఒడ్డున ఉన్న నివాసాలు, భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉపగ్రహాలన్నింటినీ హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ప్రయోగించింది.ఈ చిత్రాలు ఇస్రో అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ ఉపగ్రహం RISAT ఉపగ్రహం ద్వారా తీశారు. ఈ ఉపగ్రహం మేఘాల్లోకి చొచ్చుకుపోయి భూమిలోని ఈ విధ్వంసకర దృశ్యాలను బంధించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్