రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు

ఎండ తీవ్రత ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలతోపాటు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా చతీష్ ఘడ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్ర అంతటా విస్తరించాయి.

rain

వర్షం (ఫైల్ ఫోటో)


ఎండ తీవ్రత ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలతోపాటు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా చతీష్ ఘడ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్ర అంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణం కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం తిరుపతి, అల్లూరు సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రైతాంగానికి చాలా మేలు చేకూరే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే వివిధ రకాల నాట్లు వేస్తున్న రైతులు వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా కురవనున్న వర్షాలు ప్రభావంతో రైతాంగం కొంత మేరకు ఉపశమనం పొందనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్