దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పైనుంచి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెరిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం రెండు మూడు రోజులు పాటు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పైనుంచి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెరిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం రెండు మూడు రోజులు పాటు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై సోమవారం నాటికి మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బుధ, గురువారాల్లో పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలోని పలు పరి జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు ఇతర పంటల సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరి కోతలను రెండు మూడు రోజులపాటు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పనలను కొప్పలుగా వేసుకోవాలని సూచించారు. ఇతర పంటలు వేసిన రైతులకు కూడా ఈ వర్షాలు పట్ల అవగాహనతో ఉండాలని పేర్కొంది.
ఇదిలా ఉంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. మధ్యభారతం మీదుగా వస్తున్న చలిగోరుల ప్రభావంతో చత్తీస్గడ్, దానికి అనుకొని ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణకు ఆనుకొని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఆదివారం విశాఖ ఏజెన్సీ లోనే జి మాడుగులలో 5.6, కుంత 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిమాడుగులలో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. శనివారం జిమాడుగులలో 8.9 డిగ్రీలో ఉండగా, ఒక్కరోజులో మూడు డిగ్రీలు తగ్గడం గమనార్హం. గడిచిన మూడు రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలో నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కాలంలో ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో వాతావరణం లోని ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, దీని వల్ల చలి మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. పర్యాటకంలో భాగంగా ఏజెన్సీకి వెళ్లే ప్రజలు అందుకు అనుగుణంగా జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.