నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్రవాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫానుగా మారింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో శుక్రవారం శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వాయుగుండం 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది.
తుఫాన్ ప్రభావంతో బలంగా వీస్తున్న గాలులు
నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్రవాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫానుగా మారింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో శుక్రవారం శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వాయుగుండం 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించింది. శుక్రవారం వారం మధ్యాహ్ననానికి నాగపట్నానికి తూర్పుగా 260 కిలోమీటర్లు, చెన్నైకు 300 కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్యంగా పయనించి శనివారం మధ్యాహ్నం మహాబలిపురం, కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఈ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు తొంబై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ఉత్తర తమిళనాడు వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకునే దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ, ప్రకాశం, కడప జిల్లాలో అతిభారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. శనివారం దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55 అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బాలుడు ఇస్తాయి. అలాగే డిసెంబర్ ఒకటి, రెండు తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి పెరిగింది.
తుఫాన్ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ఇతర ప్రధాన వాడరేవుల్లో రెండో నెంబర్ భద్రత సూచిక ఎగురవేశారు. తాజాగా ఏర్పడిన తుఫాన్ కు ఫెంగల్ గా పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో శుక్రవారం అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. రాజంపేటలో 21, రణస్థలంలో 18.5, లావేరులో 17, చీపురుపల్లిలో 14.5 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్లు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.