బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో భారీగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 rains

వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణ, బాపట్ల, నెల్లూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 23 నుంచి నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి బికనీర్, గుణ, మాండ్లా, రాజ్ నంద్, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. తూర్పు పశ్చిమ షియర్ జోన్ తో అనుసంధానం అయ్యి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉండనుంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయిలాండ్ పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణము వరకు విస్తరించి ఉంటుంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈనెల 23 నాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్