తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. మూసీ కేంద్రంగా నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి వరకు హైడ్రా కేంద్రంగా సాగిన రాజకీయాలు.. ప్రస్తుతం మూసీ కేంద్రంగా వివాదం సాగుతోంది. మూసీని ప్రక్షాళన చేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుండగా.. మూసీ పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించబోమంటూ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. మూసీ వ్యవహారంలో బిజెపి నేతలు కూడా అంతే ఘాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మూసీ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి.

CM Revanth Reddy, KTR, Kishan Reddy

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి వరకు హైడ్రా కేంద్రంగా సాగిన రాజకీయాలు.. ప్రస్తుతం మూసీ కేంద్రంగా వివాదం సాగుతోంది. మూసీని ప్రక్షాళన చేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుండగా.. మూసీ పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించబోమంటూ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. మూసీ వ్యవహారంలో బిజెపి నేతలు కూడా అంతే ఘాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మూసీ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి. మూసి నిర్వాసితులకు మద్దతుగా బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. అలాంటి వారి కోసం బుల్డోజర్లను సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బిజెపి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మూసి ప్రాజెక్టు పేరుతో పేదల ఇల్లు కూలుస్తామంటే ప్రభుత్వానికి సహకరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 

మూడు నెలలు ఉండి పోరాటానికి సిద్ధమని ప్రకటించిన కేటీఆర్ 

మూసి పక్కన మూడు నెలలపాటు ఉండేందుకు తాను సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మూసిపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. నాగోల్ లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని మాజీ మంత్రులు, జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూటీఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని విమర్శించారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇల్లు కూడా కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మూసీ నది లోతు పెంచి కోల్ కతా వంటి నగర నిర్మాణం చేయాలన్నారు. మూసి బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. 

పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 

మూసీ నది బ్యూటిఫికేషన్ పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చుతామంటే బిజెపి అంగీకరించబోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నది పక్కన నివాసం ఉండేందుకు తాను సిద్ధమేనని కేంద్రమంత్రి ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాలైన లంగర్ హౌస్ డివిజన్లోని రాందేవ్గుడా, బాపూనగర్ ప్రాంతాలను సందర్శించిన కిషన్ రెడ్డి స్థానికలతో మాట్లాడారు. పేదల ఇంటిని కూల్చి ఆ స్థలంలో సుందరీకరణ చేస్తామంటే బిజెపి చూస్తూ ఊరుకోదన్నారు. ముందు రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైతే మూసిలో వ్యర్ధాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు 

ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

మూసీని ప్రక్షాళన చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలు కావాలనే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేస్తామంటే బిఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్న తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. పేదల జీవితాలను మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, ఏమి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో బీఆర్ఎస్ సూచనలు ఇవ్వాలన్నారు. మంచి సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్