తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి విజయం సాధించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు విచారణ సుప్రీంకోర్టులో మంగళవారం జరగనుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు భారతీయ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన కొద్ది రోజుల్లోనే భారతీయ రాష్ట్ర సమితి నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ భారతీయ రాష్ట్ర సమితి న్యాయపరంగా పోరాడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి విజయం సాధించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు విచారణ సుప్రీంకోర్టులో మంగళవారం జరగనుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు భారతీయ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన కొద్ది రోజుల్లోనే భారతీయ రాష్ట్ర సమితి నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ భారతీయ రాష్ట్ర సమితి న్యాయపరంగా పోరాడుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ మంగళవారం జరగనుంది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా ఒకసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు రిజిస్టర్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తగినంత సమయం అంటే ఏంటో స్పష్టం చేయాలని స్పీకర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విచారణకు ఈ కేసు వస్తుండడంతో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలపొంది. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులు పై స్పందించారు. తాము పార్టీ మారలేదని వీరిద్దరూ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
భారతీయ రాష్ట్ర సమితి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ గా ఉంది. న్యాయపరంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో పార్టీ మారాలనుకునే వారికి ఇబ్బందులు సృష్టించాలని నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే భారతీయ రాష్ట్ర సమితి న్యాయపరంగా బలంగానే పోరాటాన్ని సాగిస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో కెసిఆర్ ఎలా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో వివిధ పార్టీలకు చెందిన ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఆయా పార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారని ఇప్పుడు తమ వరకు వచ్చేసరికి నీతి కబుర్లు చెబుతున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసును విచారణకు చేపడుతుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. భారతీయ రాష్ట్ర సమితి నేతలు మాత్రం తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. పార్టీ మారని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వ్యవహారాలపై కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు. అప్పుడే భవిష్యత్తులో పార్టీ మారాలనుకునే నాయకులకు తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని చెబుతున్నారు. మరి చూడాలి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మరి.