అమెరికా తదుపరి అధ్యక్షుడు అతడే.. ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు ప్రకటించి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా కీలక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గడిచిన ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్ చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. తనను తాను ఆఫ్ డెమోక్రట్, ఆఫ్ రిపబ్లికన్ అని, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకొచ్చారు. బరాక్ ఒబామా, తెల్లరి క్లింటన్లకు ఓటు వేశారని గతంలో అనేక సందర్భంలో ఆయన ప్రకటించారు.

Elan Musk, Jedi Vans

ఎలాన్ మస్క్, జెడి వాన్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు ప్రకటించి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా కీలక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గడిచిన ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్ చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. తనను తాను ఆఫ్ డెమోక్రట్, ఆఫ్ రిపబ్లికన్ అని, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకొచ్చారు. బరాక్ ఒబామా, తెల్లరి క్లింటన్లకు ఓటు వేశారని గతంలో అనేక సందర్భంలో ఆయన ప్రకటించారు. జో బైడెన్ కు కూడా అయస్టంగానే ఓట్లు వేశానని వెల్లడించారు. కానీ గడిచిన కొన్నాళ్లుగా ఆయన ట్రంప్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా తదుపరి అధ్యక్షుడు విషయంలో ఆయన చేసిన తాజా పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను తాజాగా ప్రశంసలతో ముంచేత్తారు. భవిష్యత్తులో వాన్స్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తాడని మస్క్ జోష్యం చెప్పారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశానికి కాబోయే తదుపరి అధ్యక్షుడు ఆయనే అంటూ ఒక పోస్టుకు సమానంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గడిచిన ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మస్క్ పేరు సంపాదించారు. ట్రంప్ తన గెలుపు కోసం కృషి చేసిన వారికి కీలక పదవులను కట్టబెట్టారు. ఈ క్రమంలోనే మస్క్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) సంయుక్త సారధిగా బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన పోస్ట్ సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పినప్పటికీ తన మనసులో ఉన్న భావాన్ని ఆయన వెల్లడించారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థవంతమైన పనితీరుతో అందరిని వాన్స్ ఆకట్టుకుంటున్నారు. పనితీరును దృష్టిలో పెట్టుకొని మస్కు ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మస్క్ చేసిన ఈ పోస్టు రాజకీయంగా ప్రాధాన్యత కలిగినది కావడంతో సర్వత్ర చర్చ జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్