కొత్తగా అమల్లోకి వచ్చిన టెలికమ్యూనికేషన్స్ చట్టం - 2023 ప్రకారం కేంద్రం సిమ్ కార్డులు కలిగి ఉండటంపై పరిమితి విధించింది.
ప్రతీకాత్మక చిత్రం
లా టిప్, ఈవార్తలు : ఒక వ్యక్తి 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉండటం నేరమా? 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే శిక్ష పడుతుందా? జైలు శిక్ష కూడా పడుతుందా? కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి? అంటే.. కొత్తగా అమల్లోకి వచ్చిన టెలికమ్యూనికేషన్స్ చట్టం - 2023 ప్రకారం కేంద్రం సిమ్ కార్డులు కలిగి ఉండటంపై పరిమితి విధించింది. ఆ పరిమితి దాటి ఏ వ్యక్తి కూడా అదనంగా సిమ్ కార్డులు కలిగి ఉండకూడదు. కొత్త చట్టం ప్రకారం ఒక వ్యక్తి అత్యధికంగా తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండేందుకు అధికారం ఉంది. అంతకుమించి సిమ్ కార్డులు కలిగి ఉంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద మీకు శిక్ష పడుతుంది.
ఏమిటీ కొత్త చట్టం..?
2023 డిసెంబర్ నెలలో టెలికమ్యూనికేషన్స్ చట్టం- 2023 పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. అదే నెల 24న రాష్ట్రపతి ఆమోదం పొంది, గెజిట్ రూపంలో ప్రచురితమైంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం - 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం - 1933 స్థానంలో కొత్తగా టెలి కమ్యూనికేషన్స్ చట్టం - 2023ను అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం.. స్పెక్ట్రమ్ సరైన వినియోగం జరగాలి. టెలికమ్యూనికేషన్స్ నిరోధించే పరికరాల వినియోగంపై నిషేధం, ట్రాయ్ చైర్ పర్సన్, సభ్యుల నియామకం కోసం ప్రమాణాలను రూపొందించారు.
9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ కలిగి ఉంటే..
- తొలిసారి రూ.50 వేల జరిమానా పడుతుంది.
- ఆ తర్వాత రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
- జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవటం ఎలా..?
- www.sancharsaathi.gov.inలో మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
- మీకు తెలియనివి, అనవసరమైన సిమ్ కార్డులను రిపోర్ట్ కొట్టవచ్చు.