పిల్లల్ని కనండి ప్రోత్సాహకాలు అందుకోండి.. ప్రజలకు ప్రభుత్వం ఆఫర్

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ చైనాలోనే అత్యధిక జనాభా ఉన్నట్టు లెక్క. భారత్ చైనా జనాభాను దాటేసినట్లు గణాంకాలు చెబుతున్న అది అధికారికంగా మాత్రం కాదు. ఎందుకంటే భారత్లో జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే అత్యధిక జనాభా కలిగిన చైనా మరింత మంది జనాభాను కనాలంటూ ప్రజలను కోరుతోంది. ఇందుకోసం భారీ నజరానాలను అందించేందుకు సిద్ధమవుతోంది.

A family in China

చైనాలోని ఒక కుటుంబం

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ చైనాలోనే అత్యధిక జనాభా ఉన్నట్టు లెక్క. భారత్ చైనా జనాభాను దాటేసినట్లు గణాంకాలు చెబుతున్న అది అధికారికంగా మాత్రం కాదు. ఎందుకంటే భారత్లో జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే అత్యధిక జనాభా కలిగిన చైనా మరింత మంది జనాభాను కనాలంటూ ప్రజలను కోరుతోంది. ఇందుకోసం భారీ నజరానాలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే గడిచిన రెండేళ్లుగా చైనాలో జననాల రేటు భారీగా తగ్గింది. ఈ పరిస్థితుల్లోనే చైనా అనేక విధానాలను ప్రకటిస్తోంది. ఇందులో పిల్లల పుట్టుక సబ్సిడీ విధానం, ఎక్కువమంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు పన్ను తగ్గింపు వంటి విధానాలు ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యంగా చెబుతున్నారు. పిల్లల జనన రేటును పెంచేందుకు వీలుగా చైనా స్టేట్ కౌన్సిల్ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో డెలివరీ సపోర్ట్ సేవలను పెంచడం, శిశు సంరక్షణ వ్యవస్థను విస్తరించడం, విద్య, గృహ నిర్మాణం, ఉపాధిలో సహాయం అందించడం వంటి 13 పాయింట్ల అవుట్ లైన్ ను రూపొందించారు.

వీటిని రానున్న రోజుల్లో అమలు చేయనున్నారు. పిల్లల పుట్టుకకు అనుకూలమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతగా పేర్కొంది. కొత్త పాలసీలు ఆధారంగా శిశు జనన రాయితీ వ్యవస్థను మెరుగుపరచవచ్చని మార్గదర్శకాలో చెప్పింది. రాష్ట్ర కౌన్సిల్ వివాహం, పిల్లలను కనే కొత్త సంస్కృతిని ప్రోత్సహించడంపై ఉద్ధాటించింది. ఇందుకోసం సరైన వయసులో పెళ్లి చేయడం, పిల్లలను తల్లిదండ్రులు ఉమ్మడిగా చూసుకోవడం వంటి ప్రాధాన్యత క్రమాలను కూడా తెలియజేసింది. వీటిలో మెరుగైన ప్రసూతి బీమా, ప్రసూతి సెలవులు, సబ్సిడీలు, పిల్లలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలు ఉన్నాయి. బాలల సంరక్షణ కేంద్రాల కోసం బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ఈ తరహా సేవలకు పన్నులు, రుసుములను మినహాయించాలని కౌన్సిల్ స్థానిక ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. చైనా తాజాగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా జనాభా నియంత్రణపై దృష్టి సారించకుండా.. మరింతగా పెంచే చర్యలను చేపట్టడం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఈ తరహా చర్యలకు చైనా సిద్ధమైనట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్