రోగులు వినియోగిస్తున్న మందుల్లో చాలా వరకు నాణ్యత ఉండటం లేదంటూ కేంద్రీయ ఔషధ నియంత్రణ అథారిటీ తాజాగా విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదిక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న రోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నాణ్యత లేకుండా విక్రయిస్తున్న మందులు జాబితాలో 50కిపైగా ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది. నిర్ణీత నాణ్యత ప్రమాణాలకు తగినట్లు లేనివి (ఎన్ఎస్క్యూ) అంటూ నివేదికలో వెల్లడించింది.
మందులు
మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానాల నేపథ్యంలో అనారోగ్య సమస్యలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారంతా తప్పనిసరిగా మందులు వినియోగించాల్సిన దుస్థితి నెలకొంటోంది. అయితే, రోగులు వినియోగిస్తున్న మందుల్లో చాలా వరకు నాణ్యత ఉండటం లేదంటూ కేంద్రీయ ఔషధ నియంత్రణ అథారిటీ తాజాగా విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదిక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న రోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నాణ్యత లేకుండా విక్రయిస్తున్న మందులు జాబితాలో 50కిపైగా ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది. నిర్ణీత నాణ్యత ప్రమాణాలకు తగినట్లు లేనివి (ఎన్ఎస్క్యూ) అంటూ నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో జ్వరం కడుపులో పోత లాంటి వాటికి వాడే పారాసెట్మాల్, పాన్ డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీబయాటిక్ కూడా ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసిన వాటిలో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లు ఉండటం కూడా ఆందోళన రెట్టింపు కావడానికి కారణమవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్య భద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా అంతర్జాతీయంగా ఔషధాలు ఎగుమతుల్లో అగ్రగామిగా, ప్రపంచానికి మందుల అంగడిగా భారతదేశానికి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయా మందుల నాణ్యతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అదే సమయంలో దేశంలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఆయా ఔషధ తయారీ సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారానే ఈ తరహా నాణ్యత లోపాన్ని సవరించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాది 51 ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం గడిచిన ఏడాది 1306 నమూనాలను పరీక్షించినప్పుడు ఆ విషయం బయటపడింది. భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం 1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతోంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది.చట్ట ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన ఉత్పత్తుల గురించి ప్రతి నెల నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది కేంద్రీయ ఔషధ నాణ్యత నియంత్రణ (సిడిఎస్సిఓ) సర్వసాధారణంగా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలను, ఆ పరీక్షల్లో తప్పిన మందులు జాబితాను ఎప్పటికప్పుడు వెళ్లడం మంచిదే. దీనివల్ల అన్ని వర్గాలు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. సామాన్య జనం నిత్యం వాడే యాంటీబయాటిక్స్, షుగర్, బీపీ మందులు కూడా నిర్ణీత నాణ్యత ప్రమాణాల్లో విఫలమవుతున్నట్లు తాజా నివేదికల్లో వెళ్లడి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సి విటమిన్లు, బి కాంప్లెక్స్ మందులు నాసిరకమని తేలింది.
భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు విలీన పరీక్షల్లో, మరికొన్ని నీటి పరీక్షల్లో విఫలమైనట్లు అధికారికంగా వెల్లడించారు నాణ్యత మాట అటు ఉంచితే కొన్ని బ్యాచ్ ఔషధాలు అచ్చంగా నకిలీగా తేలాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఔషధ సరఫరాదారుగా భారతదేశానికి ఉన్న పేరు, ప్రతిష్ఠులకు భంగం కలిగించేలా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నకిలీ మందులు తయారీలో నాణ్యత లేకుండా మందులను ప్రజలకు అందించేలా చేస్తున్న సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే వీటికి అడ్డు కట్టపడుతుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తాయి. ఇటువంటి వివాదాలు మరిన్ని చోట్ల వస్తే భారతీయ ఔషధ రంగానికి పెద్ద దెబ్బగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఔషధ తయారీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు అంతర్జాతీయంగా ఔషధ రంగంలో భారత్ కు ఉన్న పేరును మరింత సుసంపన్నం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.