గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ₹100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు మాత్రం గుండుసున్నా మిగిల్చిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు
ఏపీకి కేంద్రం రూ. 100 కోట్ల నిధులు..తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ₹100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు మాత్రం గుండుసున్నా మిగిల్చిందన్నారు.
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని విమర్శించారు హరీశ్ రావు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయిని ఆరోపించారు.లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఉండి ఉంటే, ఇలాంటి అన్యాయం జరిగేది కాదని స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఏపీకి అడిషనల్ గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చారని తెలిపారు హరీశ్‌రావు. నిధుల కేటాయింపులో తెలంగాణకు మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యే చూపుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.