వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌.. మంజూరు చేసిన గుంటూరు కోర్టు

వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నందిగాం సురేష్‌ పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లారు. ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్‌ను అరెస్ట్‌ చేసిన తరువాత ఆయనకు బెయిల్‌ వచ్చింది. ఆ తరువాత మరో కేసులో ఆయన అరెస్ట్‌ అయ్యారు. అదే 2020 డిసెంబరులో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి చేసుకుంది.

Former MP Nandigam Suresh

మాజీ ఎంపీ నందిగాం సురేష్‌

వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నందిగాం సురేష్‌ పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లారు. ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్‌ను అరెస్ట్‌ చేసిన తరువాత ఆయనకు బెయిల్‌ వచ్చింది. ఆ తరువాత మరో కేసులో ఆయన అరెస్ట్‌ అయ్యారు. అదే 2020 డిసెంబరులో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి చేసుకుంది. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెంది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78 వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు. ఈ కేసులోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన అరెస్ట్‌ అయ్యారు. తొలుత ఈ కేసులో అరెస్ట్‌ అయిన సురేష్‌ బెయిల్‌ కోసం తీవ్రంగానే పోరాటాన్ని సాగించారు. బాపట్ల జైలులో కొన్ని నెలలు నుంచి ఉన్న సుప్రీం కోర్టు వరకు వెళ్లి బెయిల్‌ కోసం పోరాటాన్ని సాగించారు. సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. తాము ఈ కేసులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆ తరువాత సురేష్‌ మరోసారి దిగువ కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. చివరి ప్రయత్నాలు ఫలించడంతో తాజాగా మెయిల్‌ లభించింది. వీటితోపాటు రాజదాని ప్రాంతం అమరావతిలో ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌పై దాడి చేసిన ఘటనలో సురేష్‌ నిందితుడిగా ఉన్నారు. మరియమ్మ హత్య కేసులో బెయిల్‌ లభించినప్పటికీ ఈ కేసులో బెయిల్‌ రాకపోవడంతో ఆలస్యమైంది. తాజాగా ఈ కేసులోనూ బెయిల్‌ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. సుమారు ఐదు నెలలపాటు జైలులో నందిగం సురేష్‌ ఉన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్