బీమాపై జీఎస్టీ మినహాయింపు.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం

జీవిత, ఆరోగ్య భీమాల ప్రీమియంపై వస్తు సేవా పన్ను జీఎస్టీ విషయంలో మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత బీమా, టర్మ్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య భీమా పాలసీలపై జిఎస్టి మినహాయిస్తూ ప్రతిపాదించింది. సీనియర్ సిటిజన్ల మినహా మిగతా వారికి ఐదు లక్షలలోపు కవరేజీ ఉండే ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టిని తీసేయాలని సిఫార్సు చేసింది.

GST exemption

జీఎస్టీ 

జీవిత, ఆరోగ్య భీమాల ప్రీమియంపై వస్తు సేవా పన్ను జీఎస్టీ విషయంలో మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత బీమా, టర్మ్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య భీమా పాలసీలపై జిఎస్టి మినహాయిస్తూ ప్రతిపాదించింది. సీనియర్ సిటిజన్ల మినహా మిగతా వారికి ఐదు లక్షలలోపు కవరేజీ ఉండే ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టిని తీసేయాలని సిఫార్సు చేసింది. కవరేజీ ఐదు లక్షలు దాటిన పాలసీలకు చెల్లించే ప్రీమియంపై 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని సూచించింది. టర్మ్ పాలసీపై అందరికీ జీఎస్టీ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. వీటిపైన ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తాజా సిఫార్సులపై త్వరలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. భీమా ప్రీమియంపై జిఎస్టి తొలగించాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో గత నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది.

ఈ అంశంపై చర్చించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదే విధంగా 20 లీటర్లు అంతకు మించి ప్యాకేజీ తాగు నీటిపై జిఎస్టిని 18 శాతం నుంచి ఐదు శాతానికి, నోట్ పుస్తకాలు, రూ.10 వేలు కంటే తక్కువ ధర సైకిళ్లపై 12 నుంచి ఐదు శాతానికి జీఎస్టీని తగ్గించాలని ఈ మంత్రుల సంఘం ప్రతిపాదించింది. తాజా నిర్ణయం వల్ల ఎంతో మందికి మేలు జరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టర్మ్ పాలసీలు, ఆరోగ్య భీమా పథకాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రుల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఎంతోమందికి మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్ తరువాత ఆరోగ్య భీమా, టర్మ్ ప్లాన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. వీటికి జీఎస్టీ అధికంగా వసూలు చేస్తూ ఉండడంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కేంద్రానికి వినతులు వెళ్లాయి. టర్మ్ ప్లాన్, ఆరోగ్య భీమాలకు సంబంధించి ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీని తగ్గించాలని కోరారు. దీనిపై జిఎస్టి కమిటీ తీవ్ర స్థాయిలో చర్చించి కేంద్ర మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా వీటికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని సిఫార్సులు చేసింది. జిఎస్టి మండలి సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్