గేమ్‌ చేంజర్‌ సినిమా టికెట్లు రేట్లు పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంత పెరిగిందంటే.!

గేమ్‌ చేంజర్‌ చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ హీరోగా, ప్రముఖ ధర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఈ నెల పదో తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన జీవోను విడుదల చేసింది. టికెట్‌ ధరలు పెంపునకు, స్పెషల్‌ షోలకు అనుమతిని జారీ చేసింది.

Game Changer

గేమ్‌ చేంజర్‌

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసిలాటలో ఒక మహిళ మృతి చెందిన తరువాత ఈ వ్యవహారం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ సినిమా హీరో అల్లు అర్జున్‌ను ఈ వ్యవహారం జైలుపాలు చేసింది. ఆ తరువాత నుంచి బెనిఫిట్‌ షోలు, సినిమా ధరలు పెంపు వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరిగింది. తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పడంతోపాటు రేట్లు విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్టు చెప్పింది. ఈ పరిణామాలు సంక్రాంతికి విడుదల అవుతున్న గేమ్‌ చేంజర్‌ సినిమాపై పడతాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ హీరోగా, ప్రముఖ ధర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఈ నెల పదో తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన జీవోను విడుదల చేసింది. టికెట్‌ ధరలు పెంపునకు, స్పెషల్‌ షోలకు అనుమతిని జారీ చేసింది. 

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం పదో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి గేమ్‌ చేంజర్‌ ప్రత్యేక షోలు ప్రారంభం కానున్నాయి. బెనిఫిట్‌ షోలకు టికెట్‌ రేట్‌ను రూ.600గా నిర్ణయించారు. ఇది కాకుండా మొదటి రోజు ఆరు షోలు పడనున్నాయి. ఈ ఆరు షోలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలు కంటే రూ.135(సింగిల్‌ స్కీన్‌), రూ.175 (మల్టీప్లెక్స్‌)లో పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రెండోరోజు అంటే జనవరి 11 నుంచి ఈ నెల 14 వరకు ఈ పెంపు అందుబాటులోకి ఉంటుంది. మొదటి రెండు వారాలు ఏపీ సింగిల్‌ స్ర్కీన్లలో టికెట్‌ ఽధర రూ.282.50 వరకు ఉంటుంది. మల్టీ ప్లెక్స్‌లో రూ.352 వరకు ఉండనుంది. 15వ రోజు నుంచి నార్మల్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. 

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ కల్యాణ్‌..

గేమ్‌ చేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం సాయంత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొద్ది క్షణాల్లో ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ వేదికపై బాబాయ్‌, అబ్బాయ్‌ ఇద్దరూ మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటున్న తొలి సినిమా వేడుక కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్